Aamir Khan- Fatima Sana Shaikh: రీల్ లో కూతురు, రియల్ లో భార్య.. అమీర్ ఖాన్ మూడో పెళ్ళి?!

కిరణ్ రావు తో విడిపోయిన తర్వాత అమీర్ ఖాన్ మొన్నటిదాకా ఒంటరిగానే ఉండేవారు. ఇప్పుడు ఆయన త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

  • Written By: Bhaskar
  • Published On:
Aamir Khan- Fatima Sana Shaikh: రీల్ లో కూతురు, రియల్ లో భార్య.. అమీర్ ఖాన్ మూడో పెళ్ళి?!

Follow us on

Aamir Khan- Fatima Sana Shaikh: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఫేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేమలు,కటీఫ్ లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఎన్నో జంటలు ఆగిపోయినవి ఎన్నో ఉన్నాయి. చాలాకాలం మునిగి తేలిన తర్వాత విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ఒక వార్త కొద్ది రోజులుగా మీడియాలో ఒకటే చక్కర్లు కొడుతోంది. మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ నటుడిగా పేరు పొందిన ఈయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా దారుణమైన పరాజయాన్ని పొందడంతో ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేవీ సైన్ చేయలేదు. ఇది తోడు ఇప్పట్లో అమీర్ సినిమాలు చేసే ఉద్దేశంలో లేరని ఆయన సన్నిహితులు అంటున్నారు.

కిరణ్ రావు తో విడిపోయిన తర్వాత అమీర్ ఖాన్ మొన్నటిదాకా ఒంటరిగానే ఉండేవారు. ఇప్పుడు ఆయన త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోబోయే నటి మరెవరో కాదు.. దంగల్ సినిమాలో ఆయనకు కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడైకుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ఒకే ఫ్లాట్లో ఉంటున్నట్టు సమాచారం. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండగా పలుమార్లు మీడియా కంటపడ్డారు. అమీర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్ వేడుకల్లో కూడా ఫాతిమా కనిపించింది. కెమెరాలకు ఫోజులు కూడా ఇచ్చింది. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.

ఇక ఫాతిమా, అమీర్ ఖాన్ కలిసి పికిల్ బాల్ ఆడారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు కూడా పోటీపడి ఆడారు. ఆ ఫోటోలో స్పోర్ట్స్ వేర్ లో ఫాతిమా చాలా అందంగా ఉంది. ఇక ఈ వార్తలు ఇలా ఉండగానే ప్రముఖ సీనిక్రిటిక్ ఉమైర్ సంధు అమీర్ ఖాన్ త్వరలోనే దంగల్ నటిని పెళ్ళాడుతాడని ట్వీట్ చేశాడు. కాగా అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 2002లో వారు విడాకులు తీసుకున్నారు. 2005లో కిరణ్ రావు ను అమీర్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారిద్దరు విడాకులు తీసుకున్నారు. 2021 నుంచి ఒంటరిగానే ఉంటున్న అమీర్ ప్రస్తుతం ఫాతిమాతో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వీటికి బలం ఇచ్చేలాగా ఫాతిమా కూడా ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అమీర్ ఖాన్ సూచనతోనే క్రేజీ ప్రాజెక్టులలో మాత్రమే నటించాలని అనుకుంటుంది. ఇప్పటికే యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో ఫాతిమాకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీని వెనుక అమీర్ ఖాన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ లాల్ సింగ్ చద్దా తర్వాత వార్తల్లో లేకుండా పోయిన అమీర్ ఖాన్..ఫాతిమా తో డేటింగ్ నేపథ్యంలో వార్తల్లో వ్యక్తి అయ్యాడు.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు