షాకింగ్: స్టార్ హీరో రెండోసారి విడాకులు !

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ షాకింగ్ విషయం బయటపెట్టారు. ఆయన తన భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే 15 ఏళ్ల తమ వివాహ బంధానికి ఇలా సడెన్ గా ఫుల్ స్టాప్ ఎందుకు పెడుతున్నారో అమీర్ – కిరణ్ రావు రివీల్ చేయలేదు. కానీ తాము విడిపోతున్న విషయాన్నీ ఇద్దరూ కలిసి ఓ ప్రకటన విడుదల చెయ్యడం అందరికీ డబుల్ షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా వీరిద్దరూ […]

  • Written By: Raghava
  • Published On:
షాకింగ్: స్టార్ హీరో రెండోసారి విడాకులు  !

Follow us on

Aamir Khan and Kiran Raoబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ షాకింగ్ విషయం బయటపెట్టారు. ఆయన తన భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే 15 ఏళ్ల తమ వివాహ బంధానికి ఇలా సడెన్ గా ఫుల్ స్టాప్ ఎందుకు పెడుతున్నారో అమీర్ – కిరణ్ రావు రివీల్ చేయలేదు. కానీ తాము విడిపోతున్న విషయాన్నీ ఇద్దరూ కలిసి ఓ ప్రకటన విడుదల చెయ్యడం అందరికీ డబుల్ షాక్ ఇచ్చింది.

ఈ సందర్భంగా వీరిద్దరూ ఓ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘భార్యాభర్తలుగా మేము విడిపోయినప్పటికీ, ఎప్పటికీ స్నేహితులుగా, అలాగే కుటుంబ సభ్యులుగా మా బంధాన్ని కొనసాగిస్తాము. ఆజాద్ తల్లిదండ్రులుగా మా జీవితాలు పెనవేసుకొని ఉంటాయి.’ అంటూ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. నిజానికి అమీర్ ఖాన్, కిరణ్ మధ్య విభేదాలు వచ్చాయని ఆ మధ్యే వార్తలు వచ్చాయి.

గత కొంత కాలంగా బాలీవుడ్ మీడియా కూడా ఈ వార్తను బాగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. ఆమీర్ ఖాన్, కిరణ్ రావుకి ఆజాద్ అనే ఒక కొడుకు ఉన్నాడు. విడిపోవాలని కొన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నప్పటికీ.. కేవలం తమ కొడుకు కోసమే వీరిద్దరూ ఇన్నాళ్లు కలిసి ఉన్నారట. కానీ ఇష్టం లేని జీవితాన్ని బలవంతంగా బతకడం వల్ల తమ కొడుకు జీవితానికి కూడా అది మంచింది కాదు అని నిర్ణయించుకుని విడిపోతున్నారు.

అమీర్ ‘లగాన్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది కిరణ్ రావు. ఆ సమయంలోనే కిరణ్ రావు మీద అమీర్ కి ప్రేమ పుట్టింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలం సహజీవనం కూడా చేశారు. 2005లో అమీర్, కిరణ్ రావుని పెళ్లాడారు. వీరికి ఆజాద్ పుట్టాడు. అయితే 15 ఏళ్ల కాపురం తర్వాత ఇప్పుడు విడిపోతుండటం ఆశ్చర్యకరం. మరోపక్క ఆమీర్ ఖాన్ మొదటి కొడుకు జునైద్ ఇప్పుడు హీరోగా కూడా అడుగుపెడుతున్నాడు.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు