US Report On Operation Sindoor: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో పిచ్చిపిచ్చి నిర్ణయాలతో పిచ్చి పాలకుడిగా ముద్రపడిపోయాడు. అమెరికన్ల కోసమే అంతా చేస్తున్నట్లు చెప్పుకుంటూ తన స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. దీంతో ఏడాది గడవక ముందే ట్రంప్ పాలనపై అమెరికన్లలో వ్యతిరేకత పెరిగింది. నోటకింగ్ పేరుతో నిరసనలు చేపట్టారు. మరోవైపు న్యూయార్క్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఓడించి.. నీ పాలన బాగాలేదని పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలా ఉంటే భారత్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మన ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంటున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తానే ఆపానని 50 సార్లకుపైగా చెప్పుకున్నాడు. పాకిస్తాన్ కూడా ట్రంప్ ప్రమేయం లేదని చెప్పినా.. పిచ్చి ట్రంప్ ఇప్పటికీ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక తాజాగా ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ గెలిచిందని తప్పుడు నివేదిక తయారు చేయించాడు.
నాలుగు రోజలకే పాకిస్తాన్ కాళ్లబేరం..
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోవడం లేదు. ఇప్పటికీ కీలక ఎయిర్ బేస్‌లకు మరమ్మతులు చేయిస్తోంది. అణుస్థావరాన్ని కూడా మన సైన్యం దెబ్బతీసింది. అమెరికా అణ్వస్త్రాలు ఉండడంతో గుట్టు బయట పడుతుందని ట్రంప్ యుద్ధం ఆపేలా పాకిస్తాన్‌తో భారత్‌ను శరణు కోరేలా చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం.. భారత్ ఓడిపోయిందని నివేదిక రూపొందించాడు. భారత్ ఆపరేషన్ సిందూర్‌లోని యుద్ధ పరిస్థితులు, విమాన నష్టాల విషయంలో అమెరికా సెనేట్ నివేదికలో అసత్యాలు పొందుపర్చాడు.
నవ్వులపాలవుతున్న ట్రంప్..
ఇప్పటికే యుద్ధం ఆపానని చెప్పుకుని ట్రంప్ నవ్వులపాలయ్యాడు. మతిస్థిమితం లేదేమో అన్నంతగా వ్యవహరించాడు. ఇప్పుడు ఏకంగా తప్పుడు నివేదికనే తయారు చేయించాడు. దీంతో ట్రంప్ కేవలం.. భారత్‌పై కోపంతోనే ఇదంతా చేస్తున్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌తో రేర్ ఎర్త్ మినరల్స్ ఒప్పందం, బిట్‌కాయిన్ వ్యాపారం చేస్తున్న ట్రంప్.. పాకిస్తాన్‌ను మంచి దోస్తీ దేశంగా ప్రశంసిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్‌లో గెలిచినట్లు తప్పుడు నివేదిక తయారు చేయించాడు. భారతదేశం పెహల్గామ్ ఉగ్రదాడికి శిక్షగా సాగించిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ మెరుగ్గా ఫలించింది,
ఏ యుద్ధం ఆపలేదు..
తాను అధికారం చేపట్టిన పది రోజుల్లో ప్రపంచంలో యుద్ధాలు అపుతానన్న ఈ ముసలి తాత ఒక్క యుద్ధం కూడా ఆపరలేదు. పైగా కొత్త యుద్ధాలు మొదలయ్యాయి. థాయిలాండ్ కంబోడియా, భారత్–పాకిస్తాన్ యుద్ధాలు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే జరిగాయి. ఇక రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపరేందుకు యత్నించి పరువు పోగొట్టుకున్నాడు. చేతగాని పనులు చేస్తూ పరువు తీసుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ విషయంలో తప్పుడు రిపోర్టు తయారు చేయించడంపై భారత్ మండిపడుతోంది.
చైనాకు అనుకూలంగా..
భారత్ ఓడిపోయిందని చెప్పడం ద్వారా భారత ఆత్మస్థైర్యం దెబ్బతీయడంతోపాటు చైనాకు మేలు చేసేలా నివేదిక రూపొందించాడు. భారత్–చైనాదగ్గరవుతున్న నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో కూడా ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ట్రంప్ ఒత్తిడికి భారత్ తలొగ్గకపోవడం, మన ప్రయోజనాలు దెబ్బతీసే వాణిజ్య ఒప్పందానికి అంగీకరించకపోవడమే ట్రంప్ తప్పుడు రిపోర్టుకు కారణం అయి ఉంటుందని తెలుస్తోంది.