Homeజాతీయ వార్తలుISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.. మాదకద్రవ్యాలు.. మత్తు పదార్థాలు.. ఇలా అనేక రకాలుగా అకృత్యాలకు పాల్పడుతూ ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్ ఐఎస్ఐ ని అత్యంత దుర్మార్గమైన గూడచార వ్యవస్థ అని పిలుస్తూ ఉంటారు. ఈ సంస్థ మనదేశంలో చేయని దారుణం అంటూ లేదు. అయితే కొంతకాలంగా మన నిఘా వ్యవస్థలు […]

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.. మాదకద్రవ్యాలు.. మత్తు పదార్థాలు.. ఇలా అనేక రకాలుగా అకృత్యాలకు పాల్పడుతూ ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్ ఐఎస్ఐ ని అత్యంత దుర్మార్గమైన గూడచార వ్యవస్థ అని పిలుస్తూ ఉంటారు.

ఈ సంస్థ మనదేశంలో చేయని దారుణం అంటూ లేదు. అయితే కొంతకాలంగా మన నిఘా వ్యవస్థలు అత్యంత పట్టిష్టంగా మారిపోయాయి. సరిహద్దుల్లో నకిలీ నగదు రవాణాకు అడ్డుకట్టపడింది. మాదకద్రవ్యాలను.. మత్తు పదార్థాలను దేశంలోకి రానివ్వకుండా తొక్కిపెట్టేశారు. ఇదంతా కూడా ఐ ఎస్ ఐ కి ఇబ్బందికర వాతావరణం కలిగించింది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐ మరో దుర్మార్గమైన విధానానికి పాల్పడింది. హిందువులను హిందువులతోనే అంతం చేసే కుట్రకు పాల్పడింది. అమాయకమైన హిందువులను లక్ష్యంగా చేసుకొని.. వారిని గూడచారులుగా మార్చడం మొదలుపెట్టింది.

మే 8, 2026 నాటికి ఆపరేషన్ సిందూర్ ముగిసి ఒక సంవత్సరం అయింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 రాష్ట్రాల్లో 457 మంది అమాయకపు హిందువులు గూఢ చర్యానికి పాల్పడుతున్నట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. వారంతా కూడా అరెస్టు అయ్యారు. వీరంతా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. అమాయకపు హిందువులకు పాకిస్తాన్ ఏజెంట్లు సోషల్ మీడియాలో మహిళల పేరుతో పరిచయం అయ్యేవారు. డబ్బులు ఎర్రగా చూపించేవారు. కొన్ని సందర్భాలలో భావోద్వేగమైన బ్లాక్మెయిల్ కు పాల్పడేవారు. వీరి ద్వారా దేశంలోని ఆర్మీ కంటోన్మెంట్లు.. డిఆర్డిఓ గెస్ట్ హౌస్ లు.. కీలకమైన రహదారుల వంటి వాటి వద్ద సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించి.. వాటి ద్వారా మిలిటరీ కదలికలను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు తెలుసుకునేవారు. ఈ సమాచారాన్ని తమ ఆధీనంలో పనిచేసే ఉగ్రవాదులకు చేరవేసేవారు.

అమాయకపు హిందువులు తాము చేస్తున్నది దేశద్రోహం అని తెలియకుండానే ఆ ఊబిలో చిక్కుకుని పోయేవారు. కేవలం డబ్బు కోసమే ఐ ఎస్ ఐ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయేవారు.. 2008 నాటి ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదులు ఎలా హిందువుల పేర్లు.. గుర్తింపు కార్డులు ధరించి ఆ దారుణానికి పాల్పడ్డారో.. అలానే కొంతకాలంగా మన దేశంలో దారుణాల సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలకు పాల్పడుతోంది. అయితే దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక బృందాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఐఎస్ఐ ఆకృత్యాలు బయట పడుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper