Akkineni Nagarjuna : మన తెలుగు ఆడియన్స్ కి ‘బిగ్ బాస్’ అనే గేమ్ షో పేరు తీస్తే , మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అక్కినేని నాగార్జున. ఈ షో కి ఆయన పేరు కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా మారిపోయింది. ఈ షో అంటేనే పరమ చిరాకు అంటూ నాగార్జున గతం లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆయనే సీజన్ 3 నుండి త్వరలో టెలికాస్ట్ అవ్వబోయే సీజన్ 10 వరకు హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ , రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వంటి వారు హోస్టులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే సెప్టెంబర్ 6 నుండి మొదలయ్యే ‘బిగ్ బాస్ 10’ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ లో రీసెంట్ గానే పాల్గొన్నారు నాగార్జున.
దీని గురించి రీసెంట్ గానే ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే ‘బిగ్ బాస్ 10′ ప్రోమో షూటింగ్ లో పాల్గొన్నాను. షూట్ చాలా బాగా జరిగింది. గత 7 ఏళ్ళ నుండి ఈ షో కి నేను హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను. ఇది పదవ సీజన్ కావడం తో సరికొత్త పద్దతిలో , అత్యంత ఉన్నత స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. సాధారణంగా నాకు ఇతరుల ప్రవర్తనను నిర్ణయించడం , సూచనలు చేయడం అసలు ఇష్టం ఉండదు. అందుకే మొదటి రెండు సీజన్స్ కి హోస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నాకు ఈ షో ఫార్మటు అలవాటైంది. గత సీజన్ చాలా పెద్ద హిట్ అవ్వడం తో , ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరాయి. ప్రేక్షకుల డిమాండ్ కి తగ్గట్టుగానే ఈ సీజన్ లో చాలా కఠినమైన టాస్కులను నిర్వహించబోతున్నాము. ఈసారి షో లో కంటెస్టెంట్స్ హద్దులు దాటినా , క్రమ శిక్షణ తప్పినా అసలు సహించేది లేదు’ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.
ఇకపోతే గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ అనే షో ని నిర్వహించి , తద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్న సంగతి తెలిసిందే. నేటి నుండి ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ షో లో 30 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. వీరి నుండి 7 లేదా 8 మంది బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటారట. గత సీజన్ లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అభిజీత్ , నవదీప్, బిందు మాధవి వంటి వారు , ఈ సీజన్ కి కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది.