Homeఅంతర్జాతీయంPakistan Army Chief Asim Munir: భారత్ స్ఫూర్తితో..పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఎదురుదెబ్బ. ఇక...

Pakistan Army Chief Asim Munir: భారత్ స్ఫూర్తితో..పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఎదురుదెబ్బ. ఇక కోలుకోవడం కష్టమే

Pakistan Army Chief Asim Munir: ఆ మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద ఎలా దాడి చేసిందో తెలుసు కదా.. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. ఉగ్రవాదులను కోలుకోకుండా చేసింది.. వీరంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు అత్యంత దగ్గర. వారు అలా నష్టపోవడం మునీర్ కు కోలుకోలేని దెబ్బ. దాని నుంచి కోలుకోవడానికి మునీర్ కు చాలా సమయం పట్టింది. ఇప్పుడు […]

Pakistan Army Chief Asim Munir: ఆ మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద ఎలా దాడి చేసిందో తెలుసు కదా.. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. ఉగ్రవాదులను కోలుకోకుండా చేసింది.. వీరంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు అత్యంత దగ్గర. వారు అలా నష్టపోవడం మునీర్ కు కోలుకోలేని దెబ్బ. దాని నుంచి కోలుకోవడానికి మునీర్ కు చాలా సమయం పట్టింది. ఇప్పుడు భారత్ స్ఫూర్తితో మునీర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తగిలిన దెబ్బ కూడా చాలా బలంగా తగిలింది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కొంతకాలంగా బలుచిస్థాన్ మీద ప్రధానంగా దృష్టి సారించారు. తన పదవి ఉండాలంటే ఆయన ఇలా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే బలూచ్ నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో యుద్ధాన్ని సాగిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. సరిహద్దుల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బలూచ్ నిరసనలు అణచివేయడంలో మునీర్ విఫలమయ్యారని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి.. ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మునీర్ సైన్యాన్ని భారీగా మోహరించి దాడులకు పాల్పడ్డారు. అయితే అక్కడి ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి వచ్చేశారు.

ఇప్పుడు తాజాగా మునీర్ కు ఊహించని దెబ్బ ఎదురైంది. బలూచ్ ఉద్యమకారుల నిరసనలు తార స్థాయికి చేరాయి. వారంతా కూడా గ్వాదర్ ప్రాంతంలోని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరం మీద ఆత్మహుతి దాడి చేశారు. ఈ సంఘటన లో 30 మంది భద్రతాసిబ్బంది చనిపోయారు. ఈదురు దాడి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు గట్టి దెబ్బ తగిలింది.. బలూచ్ నిరసనకారుల దాడిలో మునీరు బావమరిది కెప్టెన్ మహమ్మద్ జిబ్రాన్ చనిపోయాడు. బెలూచిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నందుకు ప్రతీకారకంగా ఈ దాడులు చేస్తున్నామని రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం మీద భవిష్యత్తు కాలంలో రెబల్స్ భారీ ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఆర్మీ చేసిన దాడులను స్ఫూర్తిగా తీసుకొని బలూచ్ నిరసనకారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది.. పాకిస్తాన్ మీడియా కూడా ఈ విషయాలను విశ్లేషించాయి. ఈ దాడులు భవిష్యత్ కాలంలో మరింత పెరిగితే పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper