Homeక్రీడలుKavya Maran : కావ్య జట్టా.. మజాకా.. మినిమం కాదు బ్రో.. ప్రతిదీ మ్యాగ్జిమమే..

Kavya Maran : కావ్య జట్టా.. మజాకా.. మినిమం కాదు బ్రో.. ప్రతిదీ మ్యాగ్జిమమే..

Kavya Maran : ఐపీఎల్ లో కావ్య మారన్ జట్టు కు ఒక రేంజ్ ఉంది. ఆ జట్టు కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జట్టు ఆమె చేతికి వచ్చిన తర్వాత పూర్తిగా స్వరూపమే మారిపోయింది. ఐపీఎల్ మాత్రమే కాకుండా.. కావ్య సన్ రైజర్స్ జట్టు సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఆడుతోంది. గత సీజన్లో విజేతగా కూడా నిలిచింది. గతంలో కూడా ఈ ఘనతను అందుకుంది. ఇప్పుడు ది హండ్రెడ్ 2026 లో […]

Kavya Maran : ఐపీఎల్ లో కావ్య మారన్ జట్టు కు ఒక రేంజ్ ఉంది. ఆ జట్టు కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జట్టు ఆమె చేతికి వచ్చిన తర్వాత పూర్తిగా స్వరూపమే మారిపోయింది.

ఐపీఎల్ మాత్రమే కాకుండా.. కావ్య సన్ రైజర్స్ జట్టు సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఆడుతోంది. గత సీజన్లో విజేతగా కూడా నిలిచింది. గతంలో కూడా ఈ ఘనతను అందుకుంది. ఇప్పుడు ది హండ్రెడ్ 2026 లో కూడా కావ్య జట్టు అదరగొడుతోంది. ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతోంది.

ఇంగ్లాండ్ వేదికగా ది హండ్రెడ్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో సన్ రైజర్స్ లీడ్స్.. లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఆగస్టు 4న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కావ్య జట్టు బ్యాటర్లు కొట్టారు. ఈ మ్యాచ్లో మొత్తం 31 సిక్సర్లు నమోదు అయ్యాయి. 465 పరుగులను బ్యాటర్లు కొట్టారు. ముఖ్యంగా కావ్య జట్టు ప్లేయర్లు మార్ష్, రికెల్టన్ గొప్పగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి దూకుడు వల్ల అనేక రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్లో కావ్య జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మార్ష్, రికెల్టన్ గొప్ప ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 148 రన్స్ కొట్టారు. కావ్య జట్టుకు ఏ వికెట్ కైనా నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే. గతంలో కావ్య జట్టు బ్యాటర్లు 11 పరుగుల రికార్డును నమోదు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది. మార్ష్ 37 బంతుల్లోనే 6 ఫోర్లు.. ఏడు సిక్సర్లతో 76 పగులు చేశారు. రికెల్టన్ 42 బంతుల్లో ఆరు ఫోర్లు..8 సిక్సర్ల సహాయంతో 94* పరుగులు చేశాడు. బ్రూక్ 18 బంతుల్లో ఐదు శిక్షల సహాయంతో 55 పరుగులు చేశాడు. ఫలితంగా కావ్య జట్టు రెండు వికెట్లు నష్టానికి 241 పరుగులు చేసింది.

242 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన లండన్ జట్టు 37 ఓటమిపాలైంది. లండన్ జట్టుకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. 26 బంతుల్లోనే 56 పరుగులు మాత్రమే చేసిన ఆ జట్టు.. ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డేవిడ్ విల్లి అదరగొట్టినప్పటికీ.. లండన్ విజయం సాధించలేకపోయింది. విల్లి 83 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. లండన్ జట్టు 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్లో కావ్య జట్టు 21 సిక్సర్లు.. లండన్ జట్టు పది సిక్సర్లు నమోదు చేసింది. మొత్తం గారు రెండు జట్లు 31 సిక్సర్లు కొట్టాయి. అంతేకాదు ఈ రెండు జట్లు 445 పరుగులు చేశాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper