Indian American Trade: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తన 2.0 పాలనలో భారత్‌ను పూర్తిగా శత్రుదేశంగా పరిగణిస్తున్నాడు. ఆయన చెప్పినట్లుగా వినాలని హుకూం జారీ చేస్తున్నాడు. వినలేదన్న కోపంతో భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో అమెరికాలో భారతీయ వస్తువులకు డిమాండ్ తగ్గుతుందని భావించాడు. కానీ, ట్రంప్‌ను అమెరికన్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. మన వస్తువులనే అమెరికన్లు ఎక్కువగా నమ్ముతున్నారు. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా మన వస్తువుల ధరలు పెరిగినా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇబ్బంది పడుతున్న ట్రంప్..
భారత్‌ను దెబ్బతీయాలని ట్రంప్ భావిస్తుంటే.. అమెరికన్లు మాత్రం మన సరుకులనే ఆదరిస్తున్నారు. భారతీయ వస్తువులే కావాలని వ్యాపారులను ఒత్తిడి చేస్తున్నారు. దీంతో టారిఫ్‌ల కారణంగా దిగుమతులు తగ్గించిన వ్యాపారులు కూడా క్రమంగా మన సరుకుల దిగుమతి పెంచుతున్నారు. ఇక భారతీ వర్కర్ల స్థానంలో అమెరికన్లను నియమంచుకోవాలని ట్రంప్ ఆదేశించారు. కానీ ట్రంప్ ఆదేశాలను పాటించడం లేదు. అమెరికా వర్కర్లను పెట్టుకుంటే వేతనం ఎక్కువ ఇవ్వడంతోపాటు వారు పని చేయడానికి ఇష్టపడరు. అందుకే వ్యాపారుల థర్డ్ పార్టీ విధానం ఎంచుకుని ట్రంప్‌కు షాక్ ఇచ్చారు.
14 శాతం పెరిగిన ఎగుమతులు..
ఇక భారతీయ వస్తువులకు అమెరికాలో ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 50 శాతం టారిఫ్‌ల అమలవుతున్నా.. గడిచిన అక్టోబర్‌లో మన ఎగుమతులు 14 శాతం పెరిగాయి. మన సరుకులపై నమ్మకం, డిమాండ్‌కు ఇదే నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మన సరుకుల విషయంలో ట్రంప్ చేసిన పొరపాటు కారణంగానే ఇప్పుడు అక్కడ ధరలు పెరిగాయన్న భావన అమెరికాల్లోలో నెలకొంది. ఈ పరిస్థితి ట్రంప్ చేసిన విధానంలో ఒక వ్యతిరేక ఫలితాన్ని చూపిస్తోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు వృద్ధి చేస్తూనే, ఆ దేశంలో వస్తువుల అందరికీ కొరత కారణంగా ధరలు పెరుగుతున్నాయి.