Homeజాతీయ వార్తలుKargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.....

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం పాక్ మీద ఎలా గెలిచింది..

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.. మంచుకొండల్లో లద్ధాక్ ప్రాంతంలో కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టార్లలో నాడు పాకిస్తాన్ చొరబాటుదారులు ప్రవేశించారు. ఘాతుకాలకు పాల్పడడం మొదలుపెట్టారు. దీంతో భారత సైన్యం వెంటనే స్పందించింది. సరిగ్గా 1999 మే నెలలో ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది. వైమానిక దళం.. ఆపరేషన్ సఫేర్ […]

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.. మంచుకొండల్లో లద్ధాక్ ప్రాంతంలో కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టార్లలో నాడు పాకిస్తాన్ చొరబాటుదారులు ప్రవేశించారు. ఘాతుకాలకు పాల్పడడం మొదలుపెట్టారు. దీంతో భారత సైన్యం వెంటనే స్పందించింది. సరిగ్గా 1999 మే నెలలో ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది.

వైమానిక దళం.. ఆపరేషన్ సఫేర్ సాగర్.. నావికాదళం ఆపరేషన్ తల్వార్ ను చేపట్టాయి. దీనివల్ల భారత సైన్యం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టి తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేస్తుంది. ఎంతమంది అమరుల త్యాగాల ఫలితంగా.. 60 రోజులు సాగిన యుద్ధం తర్వాత భారత్ విజయాన్ని దక్కించుకుంది.

నాడు కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. కేవలం సైన్యం మాత్రమే కాకుండా.. భారత వైమానిక దళం కూడా ఈ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. నాడు యుద్ధంలో స్క్వాడ్రన్ లీడర్.. ప్రస్తుత గ్రూప్ కెప్టెన్ అలోక్ చౌహన్ కీలకపాత్ర పోషించారు.

కార్గిల్ ప్రాంతంలో ప్రతీ ఏడాది చలికాలంలో పర్వతాల నుంచి.. రెండు దేశాలకు సంబంధించిన సైన్యాలు కిందికి వచ్చేవి. వాస్తవానికి ఇది నిబంధన కూడా. అయితే పాకిస్తాన్ సైన్యం 1999లో నమ్మకద్రోహానికి పాల్పడింది. భారత సైన్యం దిగివచ్చిన తర్వాత.. అప్రదేశాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. ఆయుధాలను.. ఇతర సామాగ్రిని అక్కడ ఏర్పాటు చేసింది. చలికాలం పూర్తి అయిన తర్వాత భారత సైన్యం మళ్లీ ఆ ప్రాంతాలకు వెళ్తుండగా.. పాకిస్తాన్ దుర్మార్గం బయటికి వచ్చింది.. దీంతో పాకిస్తాన్ దుర్మార్గానికి ఖచ్చితమైన జవాబు చెప్పడానికి భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ మొదలుపెట్టింది.

పాకిస్తాన్ ముష్కరులు ప్రారంభంలో చొరబాట్లను పరిమితంగానే చేశారు. ఆ తర్వాత మరింత దుర్మార్గంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలకు దగ్గరగానే ఆ దేశ సైన్యం ఉంది. అయితే ఇంత సైన్యం ఉన్నప్పటికీ ఆహారం.. ఆయుధ సామాగ్రి సక్రమంగా అందకపోతే యుద్ధం చేయడం కష్టం. అందువల్లే భారత వైమానిక దళం పాకిస్తాన్ స్థావరాల కంటే.. ఆయుధ నిల్వ కేంద్రాలు.. ఆహార పంపిణీ కేంద్రం మీద దాడులు చేసింది. కేవలం శత్రువుల మీద బాంబుదాడులే కాదు.. పాకిస్తాన్ ఆనుపానుల మీద భారత సైన్యం దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ముష్కరులలో మనోధైర్యం తగ్గిపోయింది. అందువల్లే భారత సైన్యం విజయం సాధించడం ఈజీ అయిపోయింది. పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలను భారత సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.. నాటి యుద్ధంలో భారత సైనికులు ఎత్తైన శిఖరాలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక దళం శత్రువుల వ్యూహాలను ఎప్పటికప్పుడు తొక్కిపెట్టేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper