Ajay Bhupathi Interview : సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏం చేసినా పట్టించుకోకుండా కూడా ఓపిగ్గా భరిస్తూ ఉండాలి. వాటితో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగితేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు మన మనుగడ కొనసాగుతుందని చాలామంది చెబుతుంటారు. కానీ ఒక దర్శకుడు మాత్రం తన ముందు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్లను నిలదీస్తాడు. కొట్టడానికి కూడా వెనకాడడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే మంగళవారం సినిమాలతో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న అజయ్ భూపతి కావడం విశేషం… రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పాడు. తనని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుందంటూ ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. పనిలో ఏదైనా తేడా జరిగితే మాత్రం వాళ్లెవరైనా సరే కొడతానని చెప్పాడు. ఇండస్ట్రీలో ఓపిగ్గా ముందుకు వెళ్లే వాళ్లకి ఎక్కువ అవకాశాలు వస్తాయని చెబుతుంటారు. కానీ అజయ్ భూపతి తన అగ్రెసివ్ నెస్ తోనే చాలా వరకు మంచి ఆపర్చునిటీస్ ను పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన టాప్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండటం విశేషం… ఇక ఇప్పుడు మంగళవారం 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు… రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ భూపతి ఆ తర్వాత ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా మారాడు.
మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏదేమైనా కూడా ఆయన తన స్టైల్ కు తగ్గ సినిమాలను మాత్రమే చేస్తాడు. ఏ స్టోరీ తో పడితే ఆ స్టోరీ తో సినిమా చేయలేడు.
అలాగే తను రాసుకున్న కథని మార్చడానికి హీరో ప్రయత్నం చేస్తే ఆ హీరోనే మారుస్తాడు. కానీ తన కథను మాత్రం మార్చాడు ఆయన రాసుకున్న కథ పట్ల చాలా క్లారిటీగా ఉంటాడు.
ఏదేమైనా కూడా తను సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి తనకు ఇంక మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే స్టార్ హీరోలు కూడా అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి…