Homeఎంటర్టైన్మెంట్Kajal Aggarwal : 30 కోట్లు పెట్టి తీస్తే 40 లక్షలు వచ్చాయి.. కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal : 30 కోట్లు పెట్టి తీస్తే 40 లక్షలు వచ్చాయి.. కాజల్ అగర్వాల్ పని ఇక అయిపోయినట్టేనా?

Kajal Aggarwal : పాన్ ఇండియా లెవెల్ లో దాదాపుగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు , తమిళం , హిందీ అని తేడా లేకుండా , ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. ఒక స్టార్ హీరో కి ఎంత ఇమేజ్ & క్రౌడ్ పుల్ ఉంటుందో , కాజల్ అగర్వాల్ కి కూడా అంతే ఇమేజ్ […]

Kajal Aggarwal : పాన్ ఇండియా లెవెల్ లో దాదాపుగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు , తమిళం , హిందీ అని తేడా లేకుండా , ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. ఒక స్టార్ హీరో కి ఎంత ఇమేజ్ & క్రౌడ్ పుల్ ఉంటుందో , కాజల్ అగర్వాల్ కి కూడా అంతే ఇమేజ్ ఉంటుంది. సమంత ఎలా అయితే రీసెంట్ గా ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిందో , అలా కాజల్ అగర్వాల్ కూడా క్రియేట్ చేయగలదు. కానీ ఈమె ఎంచుకునే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సరిగా లేకపోవడం వల్ల , కనీసం ప్రింట్ ఖర్చులను కూడా రాబట్టలేకపోతున్నాయి.

రీసెంట్ గానే ఈమె ‘ది ఇండియా స్టోరీ’ అనే బాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసింది. విడుదలకు ముందు ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొన్నది. సమాజం లో ఉండే సమస్యల గురించి తీసిన సినిమా కావడంతో పాటు , ప్రొమోషన్స్ కూడా భారీగా చేయడంతో కచ్చితంగా ఈ సినిమాకు మినిమం గ్యారంటీ వసూళ్లు వస్తాయని అనుకున్నారు. ఈ చిత్రానికి దాదాపుగా 30 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారు నిర్మాత. కానీ విడుదల తర్వాత కేవలం 40 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంటే కనీసం ప్రింటు ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది అన్నమాట. రీసెంట్ గా విడుదలైన లేడీ ఓరియెంటెడ్ సినిమాల క్యాటగిరీలో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కనీసం టాలీవుడ్ లో అయినా కాజల్ అగర్వాల్ ఈ సినిమా చేసుంటే వేరేలా ఉండేదని , అనవసరం గా బాలీవుడ్ లోకి వెళ్లిందని ఆమె అభిమానులు కొంతమంది అంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోపక్క ఆమె బాలీవుడ్ లో నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయన్ ‘ లో రావణుడి సతీమణి మండోదరి పాత్ర పోషించింది. ఈ రెండు సినిమాల మీదనే ప్రస్తుతం కాజల్ భారీ ఆశలు పెట్టుకుంది. వీటిల్లో ఏది హిట్ అయినా ఆమెకు పూర్వ వైభవం దక్కొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper