Homeప్రవాస భారతీయులుTANA Paatasala : 2026–27 విద్యా సంవత్సరానికి తానా పాఠశాల ప్రవేశాలు ప్రారంభం

TANA Paatasala : 2026–27 విద్యా సంవత్సరానికి తానా పాఠశాల ప్రవేశాలు ప్రారంభం

TANA Paatasala : అమెరికాలోని తెలుగు కుటుంబాల పిల్లలకు మాతృభాషను చేరువ చేయాలనే లక్ష్యంతో తానా (Telugu Association of North America – TANA) 2026–2027 విద్యా సంవత్సరానికి తానా పాఠశాల ప్రవేశాలను ప్రారంభించింది. తెలుగు భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు సులభంగా, ఆసక్తికరంగా బోధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్యాంశాల ఆధారంగా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా కార్యక్రమంలో […]

TANA Paatasala : అమెరికాలోని తెలుగు కుటుంబాల పిల్లలకు మాతృభాషను చేరువ చేయాలనే లక్ష్యంతో తానా (Telugu Association of North America – TANA) 2026–2027 విద్యా సంవత్సరానికి తానా పాఠశాల ప్రవేశాలను ప్రారంభించింది.

తెలుగు భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు సులభంగా, ఆసక్తికరంగా బోధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్యాంశాల ఆధారంగా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ విద్యా కార్యక్రమంలో విద్యార్థుల స్థాయిని బట్టి నాలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి తెలుగు పలుకు (లెవల్–1), తెలుగు అడుగు (లెవల్–2), తెలుగు పరుగు (లెవల్–3), తెలుగు వెలుగు (లెవల్–4).

తమ పిల్లలకు తెలుగు భాషపై పట్టు పెంపొందించడంతో పాటు తెలుగు సంస్కృతిని పరిచయం చేయాలనుకునే తల్లిదండ్రులు వెంటనే నమోదు చేసుకోవాలని తానా పిలుపునిచ్చింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆన్‌లైన్ నమోదు కోసం https://paatasala.tana.org/registration వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

అమెరికాలోని తెలుగు కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు తమ బంధువులు, స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేసి మరింత మంది చిన్నారులు తెలుగు విద్యను అభ్యసించేలా సహకరించాలని తానా కోరింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper