Homeఎంటర్టైన్మెంట్Spider Man Brand New Day : 6 రోజుల్లో 10 వేల కోట్ల గ్రాస్.....

Spider Man Brand New Day : 6 రోజుల్లో 10 వేల కోట్ల గ్రాస్.. ఇండియా లో ‘ధురంధర్’ ని దాటనున్న ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’

Spider Man Brand New Day : ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్ – బ్రాండ్ న్యూ డే’ చిత్రానికి వస్తున్న వసూళ్లను చూస్తుంటే , హాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చిన ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ మూవీ ఫైనల్ గ్రాస్ ని దాటేస్తుందేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అత్యధిక వసూళ్లను అందిస్తున్న దేశాల్లో , మన ఇండియా టాప్ 4 లో ఉందంటే నమ్ముతారా? […]

Spider Man Brand New Day : ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్ – బ్రాండ్ న్యూ డే’ చిత్రానికి వస్తున్న వసూళ్లను చూస్తుంటే , హాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చిన ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ మూవీ ఫైనల్ గ్రాస్ ని దాటేస్తుందేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అత్యధిక వసూళ్లను అందిస్తున్న దేశాల్లో , మన ఇండియా టాప్ 4 లో ఉందంటే నమ్ముతారా? , కానీ నిజంగానే ఉంది. మన పాన్ ఇండియన్ స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని వసూళ్లను రాబడుతూ ఈ చిత్రం ముందుకు దూసుకువెళ్తోంది. 6 వ రోజున కూడా ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. దీనిని బట్టే చెప్పొచ్చు , ఈ సినిమా రన్ ఎంత స్టడీ గా ఉంది అనేది.

రోజుల వారీగా ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజున 61 కోట్లు , 2 వ రోజున 48 కోట్ల 30 లక్షలు , 3 వ రోజున 70 కోట్ల 80 లక్షలు , 4 వ రోజున 77 కోట్ల 50 లక్షలు, 5 వ రోజున 23 కోట్ల 60 లక్షలు , 6 వ రోజున 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 303 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది 3D గ్లాస్ చార్జీలు మినహాయించి. 3D గ్లాస్ చార్జీలతో కలిపి చూస్తే 410 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 340 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1.1 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి. మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 10 వేల కోట్లకు పైగా గ్రాస్ అన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 28 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా , ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి . అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయట. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో తెలుగు రాష్ట్రాల నుండి 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ఏకైక ఇంగ్లీష్ చిత్రం గా సరికొత్త రికార్డు ని నెలకొల్పనుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper