Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ విజయాలను కట్టబెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయడానికి ఒక భారీ ఈవెంట్ ను కండక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అందులో నోరు జారిన రాజమౌళి నేను హనుమంతుడిని నమ్మను అంటూ ఆయన మాట్లాడిన మాటలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… అప్పటి నుంచి రాజమౌళి మీద ప్రతి ఒక్కరు సీరియస్ అవుతున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి గతంలో మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నేను నాస్తికుడినని దేవుళ్లను నమ్మనని చెప్పాడు. ఇక తన తల్లిదండ్రుల మీద ఉన్న ఇష్టంతో వాళ్లు నమ్ముతున్న నమ్మకాన్ని గౌరవిస్తానని అంతే తప్ప టెంపుల్స్ కి వెళ్లడం, ఆచారాలు పాటించడం తన వల్ల కాదని చెప్పాడు.
అలాగే హిందూ సంప్రదాయంలో మనిషి బతకడానికి 4 యోగాలున్నాయి. భక్తియోగం, కర్మయోగం, జ్ఞాన యోగం,రాజయోగం…వీటిలో భక్తియోగంలో భక్తి ఉంది. కానీ మిగిలిన వాటిలో లేదు…ఇక కర్మ యోగాన్ని నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ పోవడమే తప్ప అక్కడ భక్తికి చోటు లేదంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే రాజమౌళి నాస్తికుడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇక అలాంటి నాస్తికుడు దేవుడి మీద సినిమాలు ఎందుకు చేయడం మన దేవుళ్లను క్యాష్ చేసుకొని సినిమాలను ఎందుకు సక్సెస్ చేసుకుంటున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చేస్తున్న వైఖరి మాకు నచ్చడం లేదని నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక వీటన్నింటి మీద రాజమౌళి ఎలా స్పందిస్తాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఈవెంట్ కు సంబంధించిన విషయాల మీద ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు. ఇక మీదటైన ఆయన ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
Here is a video where Rajamouli explains what he believes and why he believes… No one has explained Nasthik and why hindu dharma accepts it better than him than him. pic.twitter.com/rK8RYtuTfL
— Srikar_Reddy (@user_reddy) November 16, 2025