Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: చరణ్ చేతిలో ఓడిపోయిన రోహిత్.. పాపం పరువు పోయిందిగా!

Bigg Boss 10 Telugu: చరణ్ చేతిలో ఓడిపోయిన రోహిత్.. పాపం పరువు పోయిందిగా!

Bigg Boss 10 Telugu: ఏది ఏమైనా ‘అగ్ని పరీక్ష 2’ లోని రోహిత్ కి , ‘బిగ్ బాస్ 10’ లోని రోహిత్ కి చాలా తేడా ఉంది. ‘అగ్ని పరీక్ష 2’ లో రోహిత్ విన్నింగ్ శాతం ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో ఉండేది. ప్రతీ టాస్క్ లోనూ తన ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించేవాడు. కానీ ‘బిగ్ బాస్ 10’ లో ఆ జోరు కనిపించడం లేదు. ఎక్కువ శాతం టాస్కులు ఓడిపోయాడు. అంతే […]

Bigg Boss 10 Telugu: ఏది ఏమైనా ‘అగ్ని పరీక్ష 2’ లోని రోహిత్ కి , ‘బిగ్ బాస్ 10’ లోని రోహిత్ కి చాలా తేడా ఉంది. ‘అగ్ని పరీక్ష 2’ లో రోహిత్ విన్నింగ్ శాతం ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో ఉండేది. ప్రతీ టాస్క్ లోనూ తన ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించేవాడు. కానీ ‘బిగ్ బాస్ 10’ లో ఆ జోరు కనిపించడం లేదు. ఎక్కువ శాతం టాస్కులు ఓడిపోయాడు. అంతే కాదు రోహిత్ ప్రవర్తన లో కూడా రెండు షోస్ లో చాలా తేడా కనిపిస్తోంది. ‘అగ్ని పరీక్ష 2’ సమయం లో అసలు ఇతనికి నోట్లో నాలుక ఉందా?, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడి కంటెస్టెంట్స్ ని తట్టుకోవడం కష్టం అని అనుకున్నారు , కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రోహిత్ రియాక్షన్స్ లో పూర్తి మార్పు కనిపిస్తోంది. తనపై ఒక్క మాట పడనివ్వడం లేదు , ఈ వారం అయితే రోహిత్ వైపు నుండి చాలా తప్పులు జరిగాయి. ముఖ్యంగా సుధీర్ తో గొడవ జరిగినప్పుడు ఆడవాళ్ళని ఉపయోగించుకున్న సుధీర్ అంటూ రోహిత్ కామెంట్స్ చేయడం ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు.

రోహిత్ నుండి ఇలాంటి రియాక్షన్స్ అసలు ఊహించలేదు అంటూ కామెంట్స్ ఆయన అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఇక టాస్కుల విషయం లో కూడా ఆయన అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. రోహిత్ కంటే ఝాన్సీ , ముకేశ్ లు ఎక్కువగా టాస్కులు గెలుస్తున్నారు. చివరికి రోహిత్ నీడలో ఉంటున్నట్టుగా అనిపించినా అమన్ కూడా నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో గెలిచాడు. ఇక నేడు స్పాన్సర్ షిప్ టాస్క్ లో రోహిత్ , చరణ్ కి మధ్య పోటీ జరగ్గా , అందులో కూడా రోహిత్ ఓడిపోయాడు. దీనిపై సోషల్ మీడియా లో ట్రోల్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి.

రోహిత్ కచ్చితంగా బిగ్ బాస్ హిస్టరీ లోనే బెస్ట్ ప్లేయర్స్ లో ఒకరు , అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతనిలోని ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే గేమ్ చెడిపోతూ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఎంత పెద్ద తోపు అయినా నేల మీదనే ఉండాలి , నన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు , నేనే బిగ్ బాస్ అనే రేంజ్ యాటిట్యూడ్ చూపిస్తే ఎలాంటివాడైన ఓడిపోవాల్సిందే. బిగ్ బాస్ 10 లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క టాస్క్ లో కూడా గెలవని చరణ్ , ఏకంగా రోహిత్ మీద గెలిచాడు అంటేనే అర్థం చేసుకోవాలి , రోజురోజుకి రోహిత్ ఎలా డౌన్ అవుతున్నాడు అనేది. వచ్చే వారం అయినా రోహిత్ తన గేమ్ ని మార్చుకుంటే విన్నర్ అయిపోయినట్టే అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper