IND vs WI: టీమిండియాలో ప్రతి స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక్కో స్థానం కోసం వేలాదిమంది పోటీపడుతూ ఉంటారు. అయితే అందులో కొంతమందికి మాత్రమే చోటు లభిస్తూ ఉంటుంది. ఒకవేళ చోటు లభించినా తుది జట్టులో ఉంటారా? ఉండరా? అనేది అనుమానమే. తుది జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ అవకాశం లభించడం కూడా అనుమానమే.
తుది జట్టులో చోటు దక్కించుకొని.. బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి అవకాశం లభించని ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండు వన్డేలలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తొలి వన్డేలో 50 ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. రెండవ వన్డేలో కూడా అదే సీన్. ఇతడు అద్భుతమైన ఆటగాడు. కానీ జట్టులో ప్లేయర్లు బీభత్సంగా ఆడటం వల్ల అవకాశాలు లభించలేదు..
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అతని మీద ట్రోల్స్ వినిపించాయి. కామెంట్లు కనిపించాయి. కాకపోతే చివరికి అతడికి అవకాశం వచ్చింది. మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ.. గిల్ వెంట వెంటనే అవుట్ కావడంతో.. కేఎల్ రాహుల్ కు అవకాశం లభించింది. దీంతో అతడు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు. మొదట్లో తన స్టైల్ లో బ్యాటింగ్ చేశాడు.. ఆ తర్వాత అదరగొట్టాడు. 87 బంతుల్లో 129* పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. గైక్వాడ్ తో కలిసి 19.. నమన్ దీర్ తో కలిసి 65, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 25, కాంబోజ్ కలిసి 40, బ్రార్ తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశాడు. తద్వారా టీమ్ ఇండియా స్కోర్ 351 పరుగులకు చేరుకుంది.
వాస్తవానికి టీం ఇండియా ఈ స్థాయిలో పరుగులు చేస్తుందని ఎవరు పెద్దగా అంచనా వేయలేదు. కానీ రాహుల్ బీభత్సమైన బ్యాటింగ్ వల్ల టీమిండియా ఈ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గనుక సమర్థవంతంగా బ్యాటింగ్ చేసి ఉంటే టీమ్ ఇండియా స్కోర్ మరింత పెరిగేది. కానీ అతడు 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో టీమిండియా భారీ స్కోరు అంచనాలు తగ్గిపోయాయి. ఏది ఏమైనప్పటికీ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడటం టీమ్ ఇండియాకు భారీ స్కోరును సంపాదించి పెట్టింది. మొదట్లో గనుక టీమిండియా వికెట్లు కోల్పోకుండా ఉంటే బాగుండేది. కచ్చితంగా స్కోరు 450 పరుగులకు చేరుకునేది. తద్వారా టీమిండియా మీద అద్భుతమైన రికార్డు ఉండేది. గిల్, విరాట్ కోహ్లీ అవుట్ కావడం టీమిండియా భారీ స్కోరును దెబ్బతీసింది.
Smiles, cheers, and celebrations all around
Scenes to cherish for KL Rahul and #TeamIndia
Updates ▶️ https://t.co/PhSJSbvW7C#INDvWI | @mflone_ | @klrahul pic.twitter.com/wFTPDqLlvt
— BCCI (@BCCI) October 3, 2026