Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: 'రేయ్.. నీ అక్క' అంటూ విజయ్ దేవరకొండ పై మండిపడ్డ రష్మిక!

Rashmika Mandanna: ‘రేయ్.. నీ అక్క’ అంటూ విజయ్ దేవరకొండ పై మండిపడ్డ రష్మిక!

Rashmika Mandanna: టాలీవుడ్ లోనే కాదు , ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ , రష్మిక పేర్లు కచ్చితంగా ఉంటాయి. వీళ్ళని చూసి కుళ్ళుకోని లవర్స్ అంటూ ఎవ్వరూ ఉండరేమో. సింగిల్స్ అయితే భవిష్యత్తులో ఇలాంటి లైఫ్ పార్టనర్ దొరికితే బాగుండును అని కోరుకుంటారు. అంతటి ఆదర్శవంతమైన జంట ఇది. సోషల్ మీడియా లో అప్పుడప్పుడు వీళ్లిద్దరు కలిసి చేసే క్యూట్ పనులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ […]

Rashmika Mandanna: టాలీవుడ్ లోనే కాదు , ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ , రష్మిక పేర్లు కచ్చితంగా ఉంటాయి. వీళ్ళని చూసి కుళ్ళుకోని లవర్స్ అంటూ ఎవ్వరూ ఉండరేమో. సింగిల్స్ అయితే భవిష్యత్తులో ఇలాంటి లైఫ్ పార్టనర్ దొరికితే బాగుండును అని కోరుకుంటారు. అంతటి ఆదర్శవంతమైన జంట ఇది. సోషల్ మీడియా లో అప్పుడప్పుడు వీళ్లిద్దరు కలిసి చేసే క్యూట్ పనులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి చూసేందుకు చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ వీళ్లిద్దరు కలిసి నటించిన చిత్రం ‘రణబలి’. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇదే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా తో కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే సిగ్నల్స్ అభిమానులకు కూడా వచ్చేసింది.

ఈ నెల 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు , అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. అందులో భాగంగా రష్మిక , విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంక్రుత్యాన్ లు కలిసి యాంకర్ సుమ తో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో రష్మిక గురించి విజయ్ మాట్లాడుతూ , ‘నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఆమె పిలిచినప్పుడు నేను పలక్కపోతే , ‘రేయ్ నీ అక్క’ అని అరుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు వంట బాగా చేస్తారా అని రష్మిక ని సుమ అడగ్గా ‘మంచి అటెంప్ట్స్ చేస్తాను’ అని సమాధానమిస్తుంది రష్మిక. అటెంప్ట్ అంటే మర్డర్ అటెంప్ట్ లాగానా అని సుమ ఫన్నీ గా అడగ్గా , అందుకు విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానం హిలేరియస్ గా అనిపించింది.

ఆయన మాట్లాడుతూ ‘ఆమె వంట చేసేటప్పుడు ఒక మినీ యుద్ధమే జరిగినట్టు అనిపిస్తాడు. వంటిల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోయి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఆద్యంతం ఫన్నీ గా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ జంట పై మా దిష్టి తగలకూడదు , ఎంత ముచ్చటగా ఉన్నారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత దాదాపుగా ప్రతీ స్టార్ హీరో సక్సెస్ లను అందుకున్నాడు, పైగా ఈ ఏడాది ఫ్లాప్ హీరోల కం బ్యాక్ ఇయర్ గా నిల్చింది. మరి విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper