Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ నుండి ఎంట్రీ ఇచ్చిన సామాన్యులలో ఒకరు శ్రేష్టి వ్యాకరణం. ‘అగ్ని పరీక్ష 2’ లో తనదైన మార్కు ని చూపించి మంచి అమ్మాయిగా ఎలా అయితే పేరు తెచ్చుకుందో , బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే రేంజ్ పేరు తెచ్చుకుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగితే , వాళ్ళతో మంచి గా మాట్లాడి కలిపే అద్భుతమైన గుణం శ్రేష్టి సొంతం. అంతే కాకుండా ఒక మంచి స్నేహితురాలు కూడా. రోహిత్ , షాలిని లకు ప్రతీ కష్టం లోనూ తోడు ఉంటూ వచ్చింది. వారిలో పాజిటివ్ ఎనర్జీ ని నింపే ప్రయత్నం చేసింది. కానీ రెండవ వీకెండ్ లో నాగార్జున అసలు నువ్వు హౌస్ లో ఉన్నట్టే తెలియట్లేదు అని చెప్పడం వల్లే ఈరోజు శ్రేష్టి ఎలిమినేట్ అయ్యింది అని చెప్పొచ్చు.
నాగార్జున అలా చెప్పేలోపు , ఎలా అయినా జనాలకు కనపడాలి అనే ఉత్సాహం తో సుధీర్ రెడ్డి పట్ల ఆమె ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా లో విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. బిగ్ బాస్ షో ని చూసే అలవాటు లేని వాళ్ళు కూడా, ఈ అంశం పై ప్రస్తావిస్తూ శ్రేష్టి పై మండిపడ్డారు. అప్పటి నుండి ఆమె గ్రాఫ్ పాతాళం లోకి పడిపోయింది. ఈ వారం ఆమె టాస్కులు అద్భుతంగా ఆడింది , అయినప్పటికీ కూడా ఆమెకు కావాల్సినంత ఇమేజ్ రాలేదు. ఓటింగ్ లో ఎలాంటి మార్పు జరగలేదు. ఫలితంగా నేడు ఆమె ఎలిమినేట్ అయ్యింది. సెలబ్రిటీలు ప్లాన్ చేసుకొని మరీ సామాన్యులను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపే స్కెచ్ వేశారు. వాళ్ళు వేసిన స్కెచ్ విజయవంతమైంది. ఈ వారం శ్రేష్టి కి ఇమ్మ్యూనిటీ దక్కేది, కానీ సుధీర్ వేసిన పోటు కారణంగా ఇమ్మ్యూనిటీ రేస్ నుండి తప్పుకుంది.
ఒకవేళ శ్రేష్టి ఇమ్మ్యూనిటీ సొంతం చేసుకొని నేరుగా 6 వ వారం లోకి అడుగుపెట్టి ఉండుంటే , ఆమె గ్రాఫ్ బాగా పెరిగేది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయింది. అయితే శ్రేష్టి ఎలిమినేట్ అవ్వగానే రోహిత్ వెక్కి వెక్కి ఏడ్చాడట. పాపం ఆమె కాపాడేందుకు రోహిత్ తో పాటు అమన్ , షాలిని అందరూ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి విఫలం అయ్యారు. సెలబ్రిటీలు చేసిన కుట్ర కి ఒక బలమైన కంటెస్టెంట్ నేడు హౌస్ నుండి వెళ్ళిపోయింది. కానీ శ్రేష్టి కి కావాల్సినంత పాపులారిటీ ఈ బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది , బయటకు వచ్చిన తర్వాత ఆమెకు మంచి భవిష్యత్తు ఉండొచ్చు.