Homeఎంటర్టైన్మెంట్Junior NTR: 'ఎవ్వరినీ వదిలిపెట్టను..మీ అంతు తేలుస్తా' అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

Junior NTR: ‘ఎవ్వరినీ వదిలిపెట్టను..మీ అంతు తేలుస్తా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

Junior NTR: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా AI మేనియా నే కనిపిస్తోంది. అందులో చక్కర్లు కొట్టే ఫోటోలు , వీడియోలు నిజమైనవా ?, లేదా AI తో క్రియేట్ చేయబడిందా అనేది తెలుసుకోవడం చాలా కాస్తమవుతోంది. ఈ AI కేవలం వినోదానికి పరిమితమైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆడవాళ్లను కించపరిచే లాగా ఉంటే మాత్రం కచ్చితంగా ఖండించాల్సిందే. అలాంటి వీడియోలు క్రియేట్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. నిన్న సోషల్ […]

Junior NTR: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా AI మేనియా నే కనిపిస్తోంది. అందులో చక్కర్లు కొట్టే ఫోటోలు , వీడియోలు నిజమైనవా ?, లేదా AI తో క్రియేట్ చేయబడిందా అనేది తెలుసుకోవడం చాలా కాస్తమవుతోంది. ఈ AI కేవలం వినోదానికి పరిమితమైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆడవాళ్లను కించపరిచే లాగా ఉంటే మాత్రం కచ్చితంగా ఖండించాల్సిందే. అలాంటి వీడియోలు క్రియేట్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. నిన్న సోషల్ మీడియా లో ‘దేవర’ చిత్రం లోని ‘చుట్టమల్లే’ సాంగ్ కి సంబంధించిన AI వెర్షన్ తెగ సంచలనం రేపింది. ఈ వీడియో లో జాన్వీ కపూర్ బట్టలను విప్పినట్టు చూపిస్తారు. ఆ వీడియో ని యువత ఎగబడి చూడడంతో బాగా వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్ వరకు ఆ వీడియో రీచ్ అవ్వడం తో ఆయన చాలా ఫైర్ అయ్యాడు. దీని పై ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ ‘స్త్రీని దేవత లాగా , మాతృమూర్తి లాగా కొలిచే ఈ నేలలో , కొంతమంది దిగజారి AI ని ఉపయోగించి అత్యంత నీచమైన వీడియోలు చేసి అవమానిస్తున్నారు. ఈ వీడియో ని క్రియేట్ చేసిన వాళ్ళని , దాన్ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వారిని అసలు వదిలిపెట్టను, వీళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను. మరోసారి ఇలాంటి పనులు చెయ్యాలంటే వణుకు పుట్టేలా చేస్తాను. నెటిజెన్స్ కి కూడా నా విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి వీడియోలు చూడకండి. ఈరోజు సినీ సెలబ్రిటీ కి చెందిన అమ్మాయికి జరిగింది , రేపు మీ కుటుంబం లో తల్లికి , చెల్లికి , అక్కకి కూడా జరగొచ్చు. ఇలాంటి వాటిని అసలు ప్రోత్సహించకండి’ అంటూ ఎన్టీఆర్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వేసిన ట్వీట్ సంచలనంగా మారడం తో , ఈ వీడియో ని క్రియేట్ చేసిన వ్యక్తి పరారు అయ్యాడు.

సోషల్ మీడియా లో ఎవరెవరు ఈ వీడియో ని అప్లోడ్ చేశారో , వాళ్లంతా డిలీట్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది ఈ వీడియో ని షేర్ చేశారు , వాళ్లపైనే కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇన్నేళ్ల నుండి ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ లో ఉన్నాడు , ఒకసారి కూడా ఆయన ఈ రేంజ్ లో ఫైర్ అయినటువంటి సందర్భం లేదు , అలాంటిది ఒక ఆడపిల్ల గౌరవం కోసం ఇంతలా రెస్పాన్స్ ఇచ్చాడంటే , ఆయనకు స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper