Telugu Senior Heroes: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సీనియర్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏజ్ లో కూడా వాళ్ళు యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ తమ వందో సినిమాను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు నాగార్జున సైతం ‘కింగ్ 100’ అంటూ ఒక సినిమాతో ప్రేక్షకువ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉంది. నాగార్జున సైతం చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు, తన వందో సినిమాను సక్సెస్ గా మారుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన వందో సినిమాగా ‘త్రినేత్రుడు’ అనే సినిమాని చేశాను. ‘కోదండరామిరెడ్డి’ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు. దాంతో చిరంజీవి 100 వ సినిమా డిజాస్టర్ గా మారింది అంటూ అప్పట్లో చాలా వరకు విమర్శలనైతే ఎదుర్కొన్నాడు.
ఇక బాలయ్య బాబు హీరోగా చేస్తున్న తన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’… ఈ సినిమాతో బాలయ్య బాబు మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. తన వందో సినిమాతో బాలయ్య సక్సెస్ ను సాధించాడు. నాగార్జున సైతం తన వందో సినిమాతో సక్సెస్ ని కొట్టి బాలయ్య బాటలో చేరుతాడా? లేదంటే ఆ సినిమాతో ఏదైనా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకొని చిరంజీవి సరసన నిలుస్తాడా? అనేది తెలియాల్సి ఉంది…