Homeఅంతర్జాతీయంNepal Floods: నేపాల్ లో వరదల వేళ అద్భుతం జరిగింది.. 1643 మంది స్టూడెంట్లను...

Nepal Floods: నేపాల్ లో వరదల వేళ అద్భుతం జరిగింది.. 1643 మంది స్టూడెంట్లను కాపాడిన ప్రిన్సిపల్ కథ

Nepal Floods: ఆయన విద్యాలయంలో పాటలు చెబుతున్నారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా ఆ పాఠాలు వింటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడంలో ఆ ప్రిన్సిపాల్ తీరు వేరు. అందువల్లే ఆయనను అందరు విద్యార్థులు ప్రేమిస్తుంటారు. తమ తండ్రి లాగా భావిస్తూ ఉంటారు. ఆ ప్రిన్సిపాల్ కూడా విద్యార్థులను తన సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటూ ఉంటారు. అటువంటి ఆ విద్యాలయం ఒకసారిగా ఆటుపోట్లకు గురైంది. గందరగోళం బారిన పడింది. భూకంపాలకు నెలవైన తమ ప్రాంతం అలా అవుతుందని […]

Nepal Floods: ఆయన విద్యాలయంలో పాటలు చెబుతున్నారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా ఆ పాఠాలు వింటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడంలో ఆ ప్రిన్సిపాల్ తీరు వేరు. అందువల్లే ఆయనను అందరు విద్యార్థులు ప్రేమిస్తుంటారు. తమ తండ్రి లాగా భావిస్తూ ఉంటారు.

ఆ ప్రిన్సిపాల్ కూడా విద్యార్థులను తన సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటూ ఉంటారు. అటువంటి ఆ విద్యాలయం ఒకసారిగా ఆటుపోట్లకు గురైంది. గందరగోళం బారిన పడింది. భూకంపాలకు నెలవైన తమ ప్రాంతం అలా అవుతుందని ఆ విద్యార్థులు ఊహించలేదు. ఆ ప్రిన్సిపాల్ కనీసం అంచనా కూడా వేయలేదు. అంతేకాదు వరద ప్రవాహం దూకుడుగా వస్తుంటే ఆ ప్రిన్సిపాల్ మరో మాటకు తావు లేకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఆయన చూపించిన తెగువ ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం అభినందించేలా చేస్తోంది.

నేపాల్ దేశంలో త్రిభువన్ త్రిశూలి అనే పేరుతో ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ కు ప్రిన్సిపల్ గా రాజేంద్ర దవాడీ కొనసాగుతున్నారు. ఆయన ఆరోజు స్కూల్లో పాఠాలు చెబుతున్నారు. ఇంతలోనే రాజేంద్ర కు ఫోన్ వచ్చింది. అది అతడి స్నేహితుడు చేశాడు. ఆ ఫోన్ కాల్ వినగానే రాజేంద్ర కు చెమటలు పట్టాయి. వెంటనే మరో మాటకు తావు లేకుండా స్కూల్లో పనిచేసే అటెండర్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే గంట కొట్టించాడు. క్షణాల కాలంలోనే గాజులను మొత్తం ఖాళీ చేయించాడు. అక్కడితోనే ఆగిపోలేదు.. విద్యార్థులందరినీ సమీపంలో ఉన్న కొండపైకి తీసుకొచ్చాడు. విద్యార్థుల కొండపైకి వెళ్లారో లేదో.. అప్పటికే వరద నీరు దూసుకు రావడంతో ఆ పాఠశాల మొత్తం కొట్టుకుపోయింది. అయితే ఈ వరద గురించి తెలియక ఒక టీచర్.. మరో ఉద్యోగి నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయారు. దాదాపు 1643 మంది విద్యార్థులను రాజేంద్ర కాపాడారు. విద్యార్థులు కొండపైకి వెళ్ళిన తర్వాత.. వరద ప్రవాహం దూసుకు రావడంతో పాఠశాల కొట్టుకుపోయింది. కళ్ళముందు పాఠశాల కొట్టుకుపోతున్న నేపథ్యంలో రాజేంద్ర కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల కొట్టుకుపోతుంటే విద్యార్థులు కూడా విలపించారు. ఇన్ని రోజులపాటు తమకు విద్యార్థులు నేర్పించిన పాఠశాల కొట్టుకుపోవడం పట్ల విద్యార్థులు తీవ్రంగా దుఃఖించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper