Indians In America: అమెరికాలో భారతీయులు విశేషమైన ప్రతిభ చూపుతున్నారు. దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. సంపాదించిన డబ్బును ఇండియాకు పంపిస్తున్నారు. ప్రపంచ దేశాలు.. ప్రపంచ స్థాయి సంస్థలు భారతీయుల గొప్పదనం గురించి గర్వంగా చెబుతున్నాయి. భారతీయులు అత్యంత కష్టపడి పని చేస్తారని కొనియాడుతున్నాయి.
మన దేశానికి చాలామంది గొప్ప పేరు తీసుకొస్తుంటే.. మరి కొంతమంది మాత్రం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. చివరికి ఫాస్ట్ ఫుడ్ లో ఉపయోగించే సాస్ విషయంలో కూడా ఇండియన్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. పైగా పుణ్యానికి వస్తే ఫినాయిల్ తాగినట్టు.. ఫ్రీగా వచ్చిందని సాస్ మొత్తాన్ని సాంతం లాగేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. ఇదే సమయంలో భారతీయుల పరువు ను పోగొడుతోంది.
అమెరికాలో స్థిరపడిన భారతీయులు చాలామంది ఉన్నారు. అమెరికాలో ఫుట్ కల్చర్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అందులో సాస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సాస్ లో కూడా టమాట.. మిర్చి.. జింజర్ లాంటి వెరైటీలు వాడుతుంటారు. అయితే సాస్ మొత్తం ఫ్రీగానే ఇస్తుంటారు.
అమెరికాలో తయారు చేసే సాస్ లో ఎటువంటి హాని కారక పదార్థాలు ఉపయోగించరు. పైగా ఆ సాస్ కూడా రుచిగా ఉంటుంది. అందువల్లే లొట్టలు వేసుకొని తింటుంటారు. భారతీయులకు కూడా చాలామంది అమెరికా సాస్ ను విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఇష్టం వరకు ఓకే. తినడం వరకు కూడా ఓకే. కానీ ఫ్రీగా వస్తుందని సాస్ ను ప్రత్యేకంగా కప్పుల్లో ప్యాక్ చేసి తీసుకువెళ్లడం ఏమాత్రం బాగోలేదు. ఒక ఇండియన్ ఇలాగే ఫ్రీ గా వస్తుందని రకరకాల సాస్ లను ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చివరికి సాస్ కూడా వదలకుండా తీసుకెళ్తున్నారని.. ఇలా చేసి కొంతమంది భారతీయుల పరువు తీస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సాస్ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది కదా.. అమెరికాలో ఫ్రీగా దొరుకుతుందని అలా తీసుకెళ్తే భారతదేశం గౌరవం ఏమవుతుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఇండియన్స్ తమ తీరు మార్చుకోవాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారుచాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఎంత టమోటో సాస్ ఫ్రీ అయితే మాత్రం..
మరి ఇలా చేస్తారా #USA pic.twitter.com/W4X8W9VLAp
— UttarandhraNow (@UttarandhraNow) August 17, 2026