Pakistan Occupied Kashmir: భారత్, పాకిస్తాన్ ఇటీవలే 80వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నాయి. భారత్‌లో ఈవేడుకలు సాఫీగా జరిగాయి. ఈసారి ప్రధాని మోదీ ప్రసంగంలో పాకిస్తాన్, చైనా దేశాల పేర్లు, కశ్మీర్ సమస్య, సీమాంతర ఉగ్రవాదం పదాలు వినిపించలేదు. అంటే భారత్ ప్రశాతంగా, నిర్భయంగా ఉందని పరోక్షంగా సంకేతం ఇచ్చారు. ఇకా సాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆ దేశంలోని అతిపెద్ద భూభాగం అయిన బలూచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఆగస్టు 11న బలూచిస్తాన్ ప్రజలు పండుగ చేసుకున్నారు. బలూచిస్తాన్ జెండాలు ఎగురవేశారు. అయితే ఆగస్టు 13న పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఇక పీవోకే, ఖైబర్‌ఫఖ్లూన్వా ప్రజలు తిరుగుబాటు కొనసాగుతోంది. పీవోకే, సిందూలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్న పాకిస్తాన్‌కు పీవోకే ప్రజలు తాజాగా షాక్ ఇచ్చారు. భారత–పాకిస్తాన్ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోని కెరన్, కుప్వారా ప్రాంతాల్లో ప్రజలు ఇండియన్ ఆర్మీ జిందాబాద్, హిందుస్తాన్ జిందాబాద్, సారే జహాసె అచ్చా వంటి నినాదాలు చేశారు. పాకిస్తాన్ పాలకులకు వినిపించాలని మైకులు పెట్టి మరీ నినాదాలు చేసి షాక్ ఇచ్చారు. జాతీయ పతాకాలు చేతబూని నినాదాలు చేయడంతో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్నది తప్పుడు ప్రచారం అని మరోసారి నిరూపితమైంది.
సరిహద్దు నినాదాల వెనుక…
ఎల్‌వోసీ దగ్గర ఇలాంటి నినాదాలు కేవలం సైనికుల ఉత్సాహాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదు. అవి రెండు ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తాయి. మొదటిది, సొంత సైనికులు, స్థానిక ప్రజలు మధ్య దేశభక్తి భావాన్ని బలోపేతం చేస్తాయి. రెండోది, అవతలి వైపు ఉన్నవారికి భారత సైన్యం మనోబలం, సామర్థ్యం, నిర్ణయాత్మకత గురించి స్పష్టమైన సందేశం ఇస్తుంది. మైకులు వాడటం, పతాకాలు ప్రదర్శించడం ద్వారా ఈ సందేశం మరింత బలంగా చేరుతుంది. సారే జహాసె అచ్చా వంటి నినాదాలు భారతీయ గుర్తింపును, ఐక్యతను నొక్కి చెబుతాయి. ఇవి కాశ్మీర్‌ను భారతదేశంలోని అంతర్భాగంగా చూసే దృక్పథాన్ని బలపరుస్తాయి.
పాకిస్తాన్ ప్రచారానికి చెంపపెట్టు
పాకిస్తాన్ సంవత్సరాలుగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై, మీడియాలో, డిప్లమాటిక్ వర్గాల్లో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ వస్తోంది. స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, భారత సైన్యం అణచివేత చేస్తోందని వంటి వాదనలు తరచుగా వినిపిస్తాయి. కెరన్–కుప్వారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికులు స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో జాతీయ నినాదాలు చేయడం ఈ కథనాలకు వ్యతిరేకంగా నిలుస్తుంది. ఇది కేవలం మాటల ప్రతిస్పందన కాదు. సైనికులు నేరుగా సరిహద్దు వద్ద, అవతలి వైపు వినిపించేలా చేసిన చర్య. ఇది ‘మేము ఇక్కడ సురక్షితంగా, బలంగా ఉన్నాం.. కాశ్మీర్ భారతదేశంలో భాగం’ అనే సందేశాన్ని నేరుగా చేరవేస్తుంది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ త్రప్పుడు ప్రచారాన్ని తిప్ప కొడుతుంది.
వ్యూహాత్మక ప్రభావం
సరిహద్దు ప్రాంతాల్లో మనోబలం కీలకం. శత్రువు వైపు నుంచి ప్రచారం, ఉగ్రవాద ప్రేరణలు వస్తూ ఉంటాయి. అటువంటి వాతావరణంలో భారత సైనికులు తమ దేశభక్తిని, ఐక్యతను బహిరంగంగా ప్రదర్శించడం రెండు వైపులా మనోబలాన్ని ప్రభావితం చేస్తుంది. సొంత వైపు సైనికులు, స్థానికుల్లో ధైర్యం పెంచుతుంది. అవతలి వైపు ఉన్నవారికి భారత సైన్యం స్థిరత్వం, సంకల్పం తెలుస్తుంది. ఇది సైనిక వ్యూహంలో భాగమైన సైకలాజికల్ ఆపరేషన్.
కెరన్, కుప్వారా సరిహద్దుల్లో వినిపించిన నినాదాలు సాధారణ ఉత్సాహం మాత్రమే కాదు. అవి కాశ్మీర్‌పై భారతదేశం స్పష్టమైన వైఖరిని, సైన్యం ఆత్మవిశ్వాసాన్ని, పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ఇచ్చిన సమాధానాలు. సరిహద్దు భద్రత, దేశభక్తి, వ్యూహాత్మక సందేశం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా సరిహద్దు ప్రాంతాల్లో మనోబలాన్ని పెంచుతూ, తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా బలమైన సమాధానంగా కొనసాగవచ్చు.
POK భారత్‌లో భాగమవుతుంది!
సారే జహాన్ సే అచ్చా… హిందుస్తాన్ హమారా!LOC సమీపంలోని కేరన్, కుప్వారా ప్రజల నినాదాలు అవతలి వైపున ఉన్నవారికీ వినిపించాయి. పాకిస్తాన్ చేస్తున్న కశ్మీర్ ప్రచారానికి ఇది చెంపపెట్టు లాంటి సమాధానం!
నూతన కశ్మీరం… మారుతున్న కశ్మీరం!
భారత్ మాతాకీ జై! pic.twitter.com/U4HV3kotjn— Neeraj Goud Gollapelli (@NeerajGoudBJP) August 17, 2026