S Jaishankar : ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉగ్రవాదంపై మరోసారి మాటల యుద్ధం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు ప్రశ్నకు ఘాటుగా స్పందించారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ.. ‘‘మీ ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుంది?’’ అని జర్నలిస్టు ప్రశ్నించినట్లు పోస్టుల్లో ఉంది.
దీనికి జైశంకర్.. ‘‘ఒక టెర్రరిస్ట్ దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోందా? కమాన్ !’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు వైరల్ అవుతున్న క్లిప్‌లో పేర్కొంటున్నారు.
భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో ఉగ్రవాదం అంశం చాలాకాలంగా కీలక వివాదంగా కొనసాగుతోంది. భారత్ తరచూ పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపిస్తూ వస్తోంది. పాకిస్థాన్ మాత్రం భారత్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో ఐరాస వంటి అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల ప్రతినిధుల వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న జైశంకర్ వ్యాఖ్యల వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.
Breaking: S Jaishankar shuts down Pakistani journalist at the UN
Journalist: When will your govt stop sponsoring terrorism in Pakistan?
Jaishankar: A terrorist country is asking me that question? Come on! pic.twitter.com/Zif8WawQaF
— Shashank Mattoo (@MattooShashank) September 25, 2026