China Smartphone: స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధర ఎంత ఎక్కువైనా ఐఫోన్ కొనుగోలు చేసేవారు లక్షల లో ఉంటారు. అయితే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు మాత్రం ఆపిల్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు అందిస్తూ ప్రపంచ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. కేవలం 199 డాలర్లు(సుమారు 17వేల నుంచి 18 వేల వరకు) ధరతోనే ఐఫోన్ కు సవాల్ విసిరే ఫోన్ అంటూ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ తరపు ఐఫోన్ ను ఓడించే ఫోన్ వచ్చిందని చైనా దేశస్తులు చెబుతున్నారు.
చైనాకు చెందిన Huawei కంపెనీ ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్.. సాంసంగ్ కు గట్టి పోటీ ఇచ్చింది. అమెరికా ఆంక్షలు విధించడంతో అనేక రకాలుగా సభలు ఎదుర్కొంది అయితే ఇప్పుడు సొంత ప్రాసెసర్లు.. సొంత ఆపరేటింగ్ సిస్టంతో మళ్ళీ బలంగా ముందుకు వస్తున్నది.
Huawei Mate 90 సంచలనం
Huawei తీసుకొచ్చిన Mate 90 సిరీస్లో అనేక రకాలుగా ఫీచర్లు కనిపిస్తున్నాయి. ఇందులో Kirin 9050 ప్రో ప్రాసెసర్ తో ప్రీమియం మోడల్ ఫోన్లను తీసుకొస్తోంది.
Harmony OS 7 operating system ఇందులో ఉంది.
సొంతంగా అభివృద్ధి చేసిన చిప్ టెక్నాలజీ దీని సొంతం. అత్యంత అధునాతనమైన కెమెరా వ్యవస్థ ఉంది. ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ సొంత టెక్నాలజీని అభివృద్ధి చేయడం హువావే సాధించిన అతి గొప్ప విజయమని చైనావాసులు చెబుతున్నారు.
ఎలా పోటీ ఇస్తుంది
ఐఫోన్ కు ప్రధాన బలం దాని ఐఓఎస్ ఎకో సిస్టం. కెమెరా.. సెక్యూరిటీ.. ప్రాసెసింగ్ సామర్థ్యం.. సాఫ్ట్ వేర్ అనుభవం విషయంలో ఆపిల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
హువావే మాత్రం మరో మార్గంలో ముందుకు వెళ్తోంది. సొంత చిప్.. సొంత ఆపరేటింగ్ సిస్టం.. సొంత యాప్ ఎకో సిస్టం నిర్మించుకున్నది. ఈ వ్యూహానికి చైనాలో బ్రహ్మాండంగా ఆదరణ లభిస్తుంది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో హువావే కు ఏకంగా 21 శాతం వాటా ఉంది. ఆపిల్ కు 19% వాటా ఉంది. చైనాలో Mate 90 ప్రారంభ ధర చైనాలో 5,999 యువాన్లు. అంటే సుమారు 900 డాలర్లు. Mate 90 Pro Max ధర 9,499 యువాన్ల నుంచి మొదలవుతుంది.
చైనా కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ప్రపంచ మార్కెట్లో పోటీని పెంచేస్తున్నాయి. అయితే హువావే ఫోన్లకు గూగుల్ మొబైల్ సర్వీసులు.. యాప్ సపోర్ట్ వంటి పరిమితులు అంతర్జాతీయ మార్కెట్లో ఇబ్బందికరంగా మారవచ్చు. ముఖ్యంగా భారత్ లో హువావే తన ఫోన్లను ఎంతవరకు అందుబాటులోకి తీసుకొస్తుంది.. గూగుల్ యాప్స్ కు ప్రత్యామ్నాయాలను ఎలా అందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. చైనా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతుంది. హువావే సొంత చిప్ ఆపరేటింగ్ సిస్టం తో ఆపిల్ కు పోటీస్తోంది. అయితే 199 డాలర్ల ధరతో ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఐఫోన్ కు సవాల్ విసిరే వ్యవహారం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం కలిగిస్తోంది.