Homeబిజినెస్Vivo X 500: 200 MP కెమెరా, ZIESS టెక్నాలజీ.. ఇంకా ఎన్ని ఫీచర్లు అంటే..

Vivo X 500: 200 MP కెమెరా, ZIESS టెక్నాలజీ.. ఇంకా ఎన్ని ఫీచర్లు అంటే..

Vivo X 500: స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివో.. మరోసారి ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్లతో ముందుకు వచ్చింది. తాజాగా Vivo X 500 సిరీస్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో Vivo X 500, X500 pro, X500 pro max అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా 200 మెగాఫిక్సెల్ కెమెరా, ZIESS టెక్నాలజీ అత్యధిక వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఈ సిరీస్ లో […]

Vivo X 500: స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివో.. మరోసారి ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్లతో ముందుకు వచ్చింది. తాజాగా Vivo X 500 సిరీస్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో Vivo X 500, X500 pro, X500 pro max అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా 200 మెగాఫిక్సెల్ కెమెరా, ZIESS టెక్నాలజీ అత్యధిక వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఈ సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

బాక్స్ ఓపెన్ చేస్తే..

Vivo X 500 అన్ బాక్సింగ్ లో ఫోన్ తో పాటు కస్టమర్లకు అవసరమైన కొన్ని ఉత్పత్తులను అందిస్తున్నారు. అందులో vivo X 500 ఫోన్, USB -A టు USB -C చార్జింగ్ కేబుల్, 90 W చార్జర్, ఫోన్ కు సరిపోయే ప్రొటెక్టివ్ కేస్. మోడల్ ఆధారంగా ఇందులో ఉన్న ఉత్పత్తులు మారే అవకాశం ఉంది…

Vivo X 500 pro max

ఈ సిరీస్లో అత్యంత ప్రీమియం మోడల్ ఇదే. ఇందులో 200 మెగాపిక్సల్ ZIESS APO టెలిఫోటో కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దూరంగా ఉన్న మిత్రులను కూడా స్పష్టంగా ఫోటోలు తీయడానికి టెలిఫోటో ఎక్స్ టెండర్ల సపోర్ట్ అందించారు. 4K 240 fps స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఇందులో ప్రత్యేకత.

Vivo X 500 pro

చిన్న సైజులో ప్రీమియం ఫ్లాగ్ షిప్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం ఈ మోడల్ రూపొందించారు. ఇందులో 6.36 అంగుళాల డిస్ ప్లే, టెలిఫోటో కెమెరా, మూవింగ్ సబ్జెక్ట్ లను ట్రాక్ చేసే వీడియో ఫీచర్లు ఉన్నాయి.

Vivo X 500

ఈ సిరీస్ లో బేస్ మోడల్ అయినప్పటికీ.. కెమెరా విషయంలో మంచి ఫీచర్లను అందిస్తోంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా.. 64 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి ప్రత్యేకమైన కెమెరా డిజైన్ కూడా ఆకట్టుకుంటున్నది.

  • Vivo X 500 మోడల్ ఫోన్ భారత మార్కెట్లో ధర 1,19,999.
  • Vivo X 500 ప్రో మోడల్ ఫోన్ భారత మార్కెట్లో ధర 1,49,999.
  • Vivo X 500 pro max(256 జీబీ) మోడల్ ఫోన్ భారత్ మార్కెట్ లో ధర 1,64,999.
  • Vivo X 500 pro max (512 జీబీ) మోడల్ ఫోన్ భారత్ మార్కెట్లో ధర 1,79,999.

X 500 pro max ఫోటోగ్రఫీ కిట్ ధర 2,29,999. ఇందులో ప్రత్యేకమైన ZIESS టెలిఫోటో ఎక్స్ టెండర్లు కూడా లభిస్తాయి. వచ్చే నెల 3 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

సాఫ్ట్ వేర్ విషయంలో ప్రత్యేకత

ఈ మూడు ఫోన్లలో Origin OS 7 అందిస్తున్నారు. ఐదేళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్.. ఏడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే కెమెరా.. ఫోటోగ్రఫీ.. వీడియో రికార్డింగ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని వివో ఎక్స్ 500 సిరీస్ తీసుకొచ్చింది. మొత్తంగా 200 మెగా ఫిక్సల్ కెమెరా.. 400 మిల్లీమీటర్ టెలిఫోటో ఈ సిరీస్ ను ప్రత్యేకంగా నిలబడుతున్నాయి. అయితే లక్ష రూపాయలకు పైగా ధర ఉండటంతో కొనుగోలు చేసే ముందు ఫీచర్లు.. అవసరాలు.. బడ్జెట్ ను కస్టమర్లు పరిశీలించుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper