Homeబిజినెస్Toyota urban cruiser Ebella: అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV.. ఒక్కసారి చార్జ్ చేస్తే 543 కిలోమీటర్లు.....

Toyota urban cruiser Ebella: అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV.. ఒక్కసారి చార్జ్ చేస్తే 543 కిలోమీటర్లు.. ధర, ఫీచర్లు ఇవే..

Toyota urban cruiser Ebella: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. టాటా మోటార్స్.. మహీంద్రా.. హ్యుందాయ్.. ఎంజీ వంటి కంపెనీలు ఇప్పటికే ఇవి ఈ విభాగంలో తమ ముద్ర వేస్తున్నాయి. ఇప్పుడు జపాన్ దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Toyota కూడా భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV తో వచ్చింది.. అదే Toyota urban cruiser Ebella.ఆకర్షణీయమైన SUV డిజైన్.. ఆత్యాధునిక టెక్నాలజీ.. 543 […]

Toyota urban cruiser Ebella: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. టాటా మోటార్స్.. మహీంద్రా.. హ్యుందాయ్.. ఎంజీ వంటి కంపెనీలు ఇప్పటికే ఇవి ఈ విభాగంలో తమ ముద్ర వేస్తున్నాయి. ఇప్పుడు జపాన్ దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Toyota కూడా భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV తో వచ్చింది.. అదే Toyota urban cruiser Ebella.ఆకర్షణీయమైన SUV డిజైన్.. ఆత్యాధునిక టెక్నాలజీ.. 543 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్.. అధునాతన సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. మరి ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంత ఉంది.. వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టయోటా తొలి ఎలక్ట్రిక్ SUV

Toyota urban cruiser Ebella భారత మార్కెట్లోకి కంపెనీకి చెందిన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ (BEV) వాహనం. మారుతి సుజుకి e Vitara తో ప్లాట్ఫామ్.. సాంకేతిక సంబంధం ఉన్నప్పటికీ టయోటా ప్రత్యేకమైన డిజైన్ తో తీసుకొచ్చింది.

ఈ కారులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి..

  • 49 KWh బ్యాటరీ.. ARAI సర్టిఫైడ్ రేంజ్.. సుమారు 440 కిలోమీటర్లు.
  • 61 KWh బ్యాటరీ.. ARAI సర్టిఫైడ్ రేంజ్ 543 కిలోమీటర్లు.
  • 61 KWh బ్యాటరీ తో వచ్చే మోడల్ లో 128 KW(సుమారు 174 hp) ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
  • ఇది 193 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టం తో ఇది వస్తుంది.

చార్జింగ్ ప్రత్యేకతలు

ఈ SUV లో AC, DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. DC ఫాస్ట్ చార్జర్ ఉపయోగిస్తే 10% నుంచి 90 శాతం వరకు చార్జింగ్ చేయడానికి సుమారు 45 నిమిషాలు పడుతుందని టయోటా కంపెనీ చెబుతోంది. ఇంట్లోనే వాల్ మౌంటెడ్ చార్జర్ ఏర్పాటు చేసుకునే సదుపాయం కూడా ఉంది. రిమోట్ చార్జింగ్ ఆపరేషన్, బ్యాటరీ మానిటరింగ్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ కారులో ప్రీమియం ఇంటీరియర్ ఎలా ఉందంటే..

  • 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.
  • 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం
  • వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే.. ఆండ్రాయిడ్ ఆటో..
  • జేబీఎల్ ప్రీమియం సౌండ్ సిస్టం
  • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
  • పనోరమిక్ గ్లాస్ రూఫ్
  • 12 రంగుల యాంబియంట్ లైటింగ్
  • వైర్లెస్ చార్జింగ్
  • స్లైడింగ్.. రిక్లైనింగ్ రియల్ సీట్లు..
  • కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి వెనక సీట్లలో సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేశారు.

భద్రతకు సంబంధించి ఏడు ఎయిర్ బ్యాగులు.. ఏ బి ఎస్.. ఈబిడి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్.. 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ లో లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ అందించారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్.. రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్.. ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 23.60 లక్షలుగా ఉంది. స్థానిక పన్నులు, ఇతర ఖర్చులను కలుపుకుంటే ధర ఎక్కువగానే ఉంటుుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper