Pawan Kalyan: ఈమధ్య కాలం లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా కి చాలా దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్నా లెజినోవా తో విడాకులు జరిగిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అయితే నేడు పంచాయితీ ఎన్నికలతో పాటు, 23 అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్ లో ఎన్నికలు జరగ్గా, పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కుని మంగళగిరి లో వినియోగించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ని చూసి అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ఎలా ఉండే పవన్ , ఇలా అయిపోయాడేంటి ?, ఆ లుక్స్ చాలా డల్ గా ఉన్నాయంటూ అభిమానులు బాధపడుతున్నారు.
ఎంత కాదు అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ విడాకుల డిప్రెషన్ నుండి తేరుకోలేదని, అది స్పష్టంగా ఆయన ముఖం లోనే తెలుస్తుందని అంటున్నారు. ఒకప్పటి ఎనర్జీ ఇప్పుడు కనిపించడం లేదు. అభిమానులు ఒక్కసారి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి, లోకల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన అద్భుత విజయాల గురించి మాట్లాడి, వారిలో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చెయ్యాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సర్పంచ్ ఎన్నికలు పూర్తి అయ్యాక అయినా పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి. మరోపక్క వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఆయన సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ముందుగా ఓజీ 2 షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణం లో ఒక సినిమా చేయబోతున్నాడు.