Home loan interest rates: సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇందుకోసం బ్యాంకులో నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుంది? ఏ బ్యాంకు ను ఎంచుకుంటే ఈఎంఐ భారం తగ్గుతుంది? అనే విషయాల మీద చాలామందికి అవగాహన ఉండదు. అటువంటి వారి కోసం ఈ కథనం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వడ్డీ రేట్ల వివరాలను పరిశీలిస్తే.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులో తక్కువ ప్రారంభ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. యూనియన్ బ్యాంకు.. యూకో బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఇంటి రుణాలు ఇవ్వడంలో పోటీ పడుతున్నాయి…
ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా రేట్ల ప్రకారం కొన్ని బ్యాంకులు ప్రారంభ హోం లోను వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభ వడ్డీ రేటు 7.25శాతం
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభ వడ్డీ రేటు 7.40శాతం
- యూకో బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 7.40శాతం
- బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభ వడ్డీ రేటు 7.45శాతం
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 7.45శాతం
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభ వడ్డీ రేటు 7.45శాతం
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 7.45శాతం
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభ వడ్డీ రేటు 7.50శాతం
- హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ప్రారంభ వడ్డీ రేటు 8 శాతం
- యాక్సిస్ బ్యాంకు ప్రారంభ వడ్డీ రేటు 8శాతం
ఏ బ్యాంకులో ఎక్కడ తక్కువంటే..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం 7.25% ప్రారంభ వడ్డీ రేటు తో ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ రేటు పొందడానికి మంచి సిబిల్ స్కోర్ అవసరం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూకో బ్యాంకులో 7.40 శాతం నుంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో ప్రారంభ రేటు 7.45 శాతం గా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభ వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఎలా ఉందంటే..
ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో ప్రారంభ వడ్డీరేట్లు సుమారు 8 శాతం నుంచి ఉన్నాయి. ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో రుణ అర్హత.. క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రారంభ వడ్డీ రేట్లు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. సర్వీస్.. లోన్ మంజూరు ప్రక్రియ.. ఇతర చార్జీలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
సిబిల్ స్కోర్ ఎలా ఉండాలంటే..
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750 కి పైగా స్కోర్ ఉంటే రుణ అర్హతకు అనుకూలంగా ఉంటుంది. 800 కు పైగా స్కోర్ ఉన్నవారికి కొన్ని బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు అందించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న రుణాల ఈఎంఐలు సకాలంలో చెల్లించడం.. క్రెడిట్ కార్డు బకాయిలను నియంత్రించడం ద్వారా క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోవచ్చు.
ఇవి కచ్చితంగా పాటించాలి
- కేవలం తక్కువ వడ్డీ రేటును చూసి బ్యాంకును ఎంపిక చేసుకోవద్దు.
- ప్రాసెసింగ్ ఫీజు.. ఇతర చార్జీలను అంచనా వేసుకోవాలి.
- ఫిక్స్ డ్, ఫ్లోటింగ్ వడ్డీరేట్ల మధ్య తేడాను గుర్తించాలి.
- ముందస్తు లోన్లకు సంబంధించిన చెల్లింపు నిబంధనలను తెలుసుకోవాలి.
- నెలవారి ఆదాయానికి అనుగుణంగా ఈఎంఐ నిర్ణయించుకోవాలి.
- అన్ని బ్యాంకుల నుంచి లోన్ల ఆఫర్లను చూసి పోల్చుకోవాలి.
ఎవరికైనా సరే సొంతిల్లు నిర్మించుకోవాలని ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారు తొందరపడకూడదు. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంకులు 7.25 శాతం నుంచి 7.50 శాతం ప్రారంభ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నాయి. ఏ వడ్డీ రేటు అనుకూలంగా ఉంటుందో అంచనా వేసుకొని.. లోన్ తీసుకోవాలి.