Homeబిజినెస్Mahindra XEV 9S: రోడ్డుమీద రాజహంస.. 500 కి.మీ రేంజ్ ..7 సీటర్ ఎలక్ట్రిక్ SUV.....

Mahindra XEV 9S: రోడ్డుమీద రాజహంస.. 500 కి.మీ రేంజ్ ..7 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు..ధరలు ఎలా ఉన్నాయంటే..

Mahindra XEV 9S: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కువగా 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు కుటుంబం మొత్తం కలిసి ప్రయాణించేందుకు వీలుగా 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి ఈ క్రమంలో ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ Mahindra తన XEV 9S ఎలక్ట్రిక్ SUV తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 500 కిలోమీటర్ల పైగా సర్టిఫైడ్ రేంజ్.. […]

Mahindra XEV 9S: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కువగా 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు కుటుంబం మొత్తం కలిసి ప్రయాణించేందుకు వీలుగా 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి ఈ క్రమంలో ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ Mahindra తన XEV 9S ఎలక్ట్రిక్ SUV తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 500 కిలోమీటర్ల పైగా సర్టిఫైడ్ రేంజ్.. మూడు వరసల సీటింగ్.. ఆధునిక టెక్నాలజీ.. ప్రీమియం ఫీచర్లతో ఈ SUV ప్రయాణాలు చేసే వారికి సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ SUV

మహీంద్రా XLV 9S ను భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ సెవెన్ సీటర్ SUV గా కంపెనీ పరిచయం చేసింది. ఇది INGLO ఎలక్ట్రిక్ ఫ్లాట్ ఫామ్ పై రూపొందించింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడు వరుసల సీటింగ్ ను అందించింది. SUV డిజైన్.. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్..LED లైటింగ్.. ఏరో డైనమిక్ బాడీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

500 కిలోమీటర్ల కు పైగా రేంజ్

ఈ కారులో వేరియంట్ ను బట్టి వేరువేరు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 59 KWh బ్యాటరీ ప్యాక్, 70 KWh బ్యాటరీ ప్యాక్, 79 KWh బ్యాటరీ ప్యాక్. పెద్ద బ్యాటరీతో వచ్చే మోడల్ కు ఒక్కసారిగా పూర్తిగా చార్జ్ చేస్తే 679 కిలోమీటర్ల వరకు MIDC సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో రేంజ్ డ్రైవింగ్ స్టైల్.. ఏసీ వినియోగం.. రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఇంటీరియర్లో అదిరిపోయే ఫీచర్లు

ఇందులో ప్రీమియం ఇంటీరియర్ అందించారు. మూడు స్క్రీన్ లతో కూడిన డాష్ బోర్డు ఉంది. పనోరమిక్ స్కై రూఫ్ ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. వైర్లెస్ చార్జింగ్ సదుపాయం ఉంది. ప్రీమియం సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. కనెక్టెడ్ కార్ టెక్నాలజీని రూపొందించారు. ఏడుగురు ప్రయాణించేందుకు వీలుగా మూడు వరసల సీట్లు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు మూడో వరుస సీట్లు ఉపయోగకరంగా ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్లు

సెక్యూరిటీ విషయంలో మహీంద్రా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో మల్టీ ఫుల్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్.. ఏ డి ఏ ఎస్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ ను బట్టి ఫీచర్లలో మార్పులు ఉంటాయి.

మహీంద్రా XEV 9S భారత మార్కెట్లో ప్రారంభ ఎక్స్ షోరూం ధర 19.95 లక్షలు గా ప్రకటించింది. టాప్ వేరియంట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. బ్యాటరీ.. వేరియంట్ ఆధారంగా ధర మారుతూ ఉంటుంది.

ఒకే కారులో కుటుంబం మొత్తం ప్రయాణించాలి అనుకునేవారు.. పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలి అనుకునేవారు.. ఆధునిక టెక్నాలజీతో కూడిన పెద్ద SUV కోరుకునే వారికి Mahindra XEV 9S మంచి ప్రత్యామ్నాయంగా ఉంది. స్థూలంగా చెప్పాలంటే 7 సీటింగ్.. పెద్ద బ్యాటరీ.. 679 కిలోమీటర్ల వరకు ప్రకటించిన MIDC రేంజ్ ప్రీమియం ఫీచర్లతో మహీంద్రా XEV 9S భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో సంచలనమైన కారుగా నిలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper