Alias Rukmini: భీష్మ తర్వాత నితిన్ చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇష్క్ చిత్రానికి ముందు ఆయనకు ఎలాంటి ఫేస్ అయితే నడిచిందో, ప్రస్తుతానికి అదే ఫేస్ నడుస్తోంది. కానీ భారీ కం బ్యాక్ ఇవ్వగల సత్తా నితిన్ లో ఇప్పటికీ ఉంది. రీసెంట్ గా ఆయన ‘అలియాస్ రుక్మిణి‘ అనే చిత్రం లో నటించాడు. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెల 4 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నితిన్ చాలా కాలం తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించినట్టు ఈ ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
నితిన్ ఈ చిత్రం లో శృంగార కావ్యాలు, పుస్తకాలు రాసే ఒక రచయితా. ఈ కారణం చేత అతనికి పెళ్లి అవ్వదు. వరుసగా మూడు సార్లు పెళ్లి చూపుల్లో నితిన్ రిజెక్ట్ అవుతాడు. కానీ హీరోయిన్ ఎక్కడో అతనికి కనెక్ట్ అవుతుంది, పెళ్ళికి కూడా ఒప్పుకుంటుంది, ఆ తర్వాత ఎదురైనా సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తీర్చిదిద్దినట్టుగా అనిపిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట లాంచ్ ప్రోగ్రాం లో హీరో నితిన్ , నిర్మాత నాని ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ముఖ్యంగా నితిన్ ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.
ఇది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఆయన కెరీర్ జయం , దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ..ఆ, భీష్మ వంటి భారీ కమర్షియల్ సక్సెస్ లు ఉన్నాయి, వాటిని మించి ఈ సినిమా ఉంటుందని చెప్పడం మామూలు విషయం కాదు. ఇక నాని కూడా సినిమా విడుదలకు ముందే సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసేశాం అంటూ చెప్పుకొచ్చాడు. నాని నుండి ఇంత కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్స్ రావడం కూడా చిన్న విషయం కాదు. ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉండడంతో, కచ్చితంగా ఈ సినిమాతో నితిన్ కుంభస్థలం బద్దలు కొడుతాడనే నమ్మకం కలుగుతోంది.