Jammu Kashmir: వాట్సప్ ఉపయోగిస్తే దొరికిపోతున్నారు. ఫేస్బుక్ వాడితే తప్పించుకోలేకపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తే సరెండర్ అవుతున్నారు. కొద్దిరోజులుగా సరిహద్దుల్లో భారత భద్రత దళాలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులకు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది.
ఇలాగైతే తమ కార్యకలాపాలు ఆగిపోతాయని.. సరిహద్దుల్లో రక్తపాతం నిలిచిపోతుందని.. తమ ఉనికికే ప్రశ్నార్ధకం ఏర్పడుతుందని ఉగ్రవాదులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు అండగా నిలవడానికి పాకిస్తాన్ సరికొత్త ఎత్తులకు పాల్పడుతోంది. భారత భద్రత దళాలు కూడా ఊహించని విధంగా సరికొత్త పన్నాగానికి తెర లేపింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం భారత సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా టెర్రరిస్టులు.. వారి హేండర్లు అత్యంత సీక్రెట్ గా సంభాషించుకుంటున్నారు. సూచనలు.. ఆదేశాలు చేరడానికి దారుణమైన వెబ్సైట్లు.. ప్రత్యేకమైన ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు.
ఉగ్రవాదుల కార్యకలాపాలను తెలుసుకోవడానికి కొంతకాలంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా వేదికల మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల నియామకాల కోసం టెర్రరిస్ట్ గ్రూపులు.. పాకిస్తాన్ దేశానికి చెందిన ఐఎస్ఐ.. రహస్య మార్గాల ద్వారా తమ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. లైవ్ చాట్ ఫీచర్లతో కూడిన దారుణమైన వెబ్సైట్లు.. యూజర్ల గుర్తింపుర దాచిపెట్టే మెసేజ్ అప్లికేషన్లను ఉగ్రవాదులు వాడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు కూడా సమాచారం. ఉగ్రవాదుల మధ్య కమ్యూనికేషన్ కోసం గతంలో వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించేవారు. అయితే దీని మీద ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా ఫోకస్ చేయడంతో ఉగ్రవాదులకు ఊపిరి సలపని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రాన్స్.. వియత్నాం ఆధారిత అప్లికేషన్లు.. చైనా మూలాలు ఉన్న అప్లికేషన్లను ఉగ్రవాదులు వాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటి పని పట్టేందుకు ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది.
“కొంతకాలంగా ఉగ్రవాదులు సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించడం లేదు కేవలం వారు రహస్య మార్గాలలో సంకేతాలు ఇచ్చుకుంటున్నారు. రకరకాల రూపాలలో సంభాషణలు సాగిస్తున్నారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అర్థమవుతుంది. అయితే వారు తమ సంభాషణలు జరుపుకోవడానికి ఎటువంటి విధానాలు ఉపయోగిస్తున్నారో లోతుగా తవ్వితే వారు ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లు, ఇంకా దారుణమైన వెబ్సైట్లు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో లైవ్ చాట్ చేసుకునే అవకాశం ఉండడంతో ఉగ్రవాదులు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు తెలియ వచ్చింది. దీనిపై భారత భద్రత దళాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.