Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: ముకేశ్ పై నోరు జారిన కెప్టెన్ అమన్..ఇంత దారుణంగా ఏ...

Bigg Boss 10 Telugu: ముకేశ్ పై నోరు జారిన కెప్టెన్ అమన్..ఇంత దారుణంగా ఏ కంటెస్టెంట్ ప్రవర్తించలేదు!

Bigg Boss 10 Telugu: సొంతంగా ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా తీసుకునే సత్తా లేని కంటెస్టెంట్ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా ఉన్నారా అంటే, అది అమన్ మాత్రమే. మొదటి 50 రోజులు రోహిత్ సలహాలు తీసుకుంటూ, అతని నీడలో గేమ్ ఆడుకుంటూ వచ్చాడు, ఇక అతన్ని అన్యాయంగా ఎలిమినేట్ చేసి బయటకు పంపేసిన తర్వాత ఇప్పుడు త్రిగున్ నీడలో గేమ్ లో ఆడుతున్నాడు. అమన్ తీసుకునే ప్రతీ నిర్ణయం లో […]

Bigg Boss 10 Telugu: సొంతంగా ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా తీసుకునే సత్తా లేని కంటెస్టెంట్ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా ఉన్నారా అంటే, అది అమన్ మాత్రమే. మొదటి 50 రోజులు రోహిత్ సలహాలు తీసుకుంటూ, అతని నీడలో గేమ్ ఆడుకుంటూ వచ్చాడు, ఇక అతన్ని అన్యాయంగా ఎలిమినేట్ చేసి బయటకు పంపేసిన తర్వాత ఇప్పుడు త్రిగున్ నీడలో గేమ్ లో ఆడుతున్నాడు. అమన్ తీసుకునే ప్రతీ నిర్ణయం లో ఇప్పుడు త్రిగున్ హ్యాండ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిగున్ చేతిలో అమన్ ప్రస్తుతం ఒక కీలు బొమ్మ. అతనితో సావాసం చెయ్యడం వల్లనో ఏమో తెలియదు కానీ, అమన్ నిన్నటి ఎపిసోడ్ లో అతనికంటే దారుణంగా వ్యవహరించాడు. నువ్వు దేనికి పనికి రావు రా మబ్బు, పెద్ద గబ్బు గాడివి, మూసుకొని చెప్పిన పని చెయ్యిరా అంటూ ముకేశ్ పై నోరు పారేసుకున్నాడు.

అసలు వీళ్లిద్దరి మధ్య గొడవ ఎక్కడి నుండి మొదలైందంటే , హౌస్ లోకి దివ్య, కళ్యాణ్ వచ్చిన సమయం లో ఆకారం ఉంది కానీ , బుర్ర మాత్రం లేదు అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావు అని ముకేశ్ ని అడగ్గా , ఆయన వెంటనే అమన్ పేరు చెప్పి, కొన్ని ఉదాహరణలు చెప్తాడు. ఇక్కడే అమన్ ట్రిగ్గర్ అవుతాడు. అప్పటి నుండి ముకేశ్ పై అమన్ మనసులో కోపం పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ముకేశ్ తాగేసిన టీ గ్లాస్ కడగకుండా బయట పెట్టాడో, అప్పుడు అమన్ దాన్ని ప్రశ్నించడం, ముకేశ్ కాస్త పొగరుగా సమాధానం చెప్పడం తో అమన్ రెచ్చిపోయి నోరు పారేసుకోవడం వంటివి జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అమన్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు. మరి వీకెండ్ లో నాగార్జున దీనిపై స్పందించి అమన్ కి కోటింగ్ ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper