Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: కళ్యాణ్, దివ్య నిఖిత లతో గొడవ పెట్టుకున్న ముకేశ్, త్రిగున్..వీళ్ళేమి...

Bigg Boss 10 Telugu: కళ్యాణ్, దివ్య నిఖిత లతో గొడవ పెట్టుకున్న ముకేశ్, త్రిగున్..వీళ్ళేమి కంటెస్టెంట్స్ బాబోయ్!

Bigg Boss 10 Telugu: అతిధి దేవో భవ అని పెద్దలు అంటుంటారు. శత్రువైన ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు మర్యాదలు చేసి పంపించాలి అనేది మన భారతీయ సంస్కృతి లోని ఒక గొప్ప ఆచారం. అలాంటి సంస్కృతి ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ సీజన్ కంటెస్టెంట్స్. అది కూడా టాప్ 2 స్థానాల్లో ఉన్నటువంటి ముకేశ్, త్రిగున్ లు చేయడం దారుణం. వివరాల్లోకి వెళ్తే గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా […]

Bigg Boss 10 Telugu: అతిధి దేవో భవ అని పెద్దలు అంటుంటారు. శత్రువైన ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు మర్యాదలు చేసి పంపించాలి అనేది మన భారతీయ సంస్కృతి లోని ఒక గొప్ప ఆచారం. అలాంటి సంస్కృతి ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ సీజన్ కంటెస్టెంట్స్. అది కూడా టాప్ 2 స్థానాల్లో ఉన్నటువంటి ముకేశ్, త్రిగున్ లు చేయడం దారుణం. వివరాల్లోకి వెళ్తే గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కొందరు హౌస్ లోకి వచ్చి కొన్ని టాస్కులు హౌస్ మేట్స్ తో కలిసి ఆడుతారు. అందులో భాగంగా గత సీజన్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల , దివ్య నిఖిత హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళతో ఒక సందర్భంలో త్రిగున్ గొడవపడుతాడు, మరో సందర్భంలో ముకేశ్ గొడవపడుతాడు. అతిధులు అనే మర్యాద కూడా ఇవ్వలేదు.

అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం దివ్య నిఖిత కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిందని అంటున్నారు. ముకేశ్ అన్న మాటకు అంతలా ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదని, నువ్వు దారుణమైన వ్యక్తివి అంటూ దివ్య మాట్లాడిన మాటలు అసలు బాగాలేదని అంటున్నారు. ఇక ముకేశ్ హేటర్స్ అయితే ఇంటికి వచ్చిన అతిధుల చేత కూడా తిట్టించుకున్నాడంటే , కచ్చితంగా అతని వైపు నుండే తప్పు ఉందని అంటున్నారు. మరి వీకెండ్ లో నాగార్జున ముకేశ్ తీరుపై ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. ముందుగా ట్రిగ్గర్ అయ్యింది మాత్రం ముకేష్, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఎక్కువగా నోరు జారింది మాత్రం దివ్య నే, ఇద్దరి వైపు నుండి తప్పులు ఉన్నాయి, మరి నాగార్జున ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తాడా?,లేదా న్యాయంగా రెస్పాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper