Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: ఆవేదనకు గురి చేస్తున్న పవన్ కళ్యాణ్ మౌనం..అసలు జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి?

Pawan Kalyan: ఆవేదనకు గురి చేస్తున్న పవన్ కళ్యాణ్ మౌనం..అసలు జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు దైవం లాగా ఆరాదించడానికి ముఖ్య కారణం, ఆయన వ్యక్తిత్వం. స్టార్స్ అందరూ వెండితెర మీద మాత్రమే హీరోలు గా కనిపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ నిజ జీవితం లో కూడా హీరో గా అనిపిస్తాడు. అందుకే ఆయన క్రేజ్ , ఫాలోయింగ్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా పవన్ అభిమానులతో మనసు విప్పి మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి. తమ ఇంట్లో మనిషి మాట్లాడితే […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు దైవం లాగా ఆరాదించడానికి ముఖ్య కారణం, ఆయన వ్యక్తిత్వం. స్టార్స్ అందరూ వెండితెర మీద మాత్రమే హీరోలు గా కనిపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ నిజ జీవితం లో కూడా హీరో గా అనిపిస్తాడు. అందుకే ఆయన క్రేజ్ , ఫాలోయింగ్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా పవన్ అభిమానులతో మనసు విప్పి మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి. తమ ఇంట్లో మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో , పవన్ కళ్యాణ్ మాటలు అలా ఉంటాయి. అదే సమయం లో ప్రత్యర్థులపై ఆయన చేసే విమర్శలు, ఉపన్యాసాలు గూస్ బంప్స్ రప్పించే రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా ఆయన మాటల్లో జనసేన పార్టీ ఆత్మాభిమానం కనిపించేది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, గత కొన్ని నెలల నుండి పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ అయిపోయాడు.

ఒకప్పటి లాగా డైనమిక్ ప్రసంగాలు ఇవ్వడం లేదు. అదే సమయంలో పార్టీ ని కూడా సీరియస్ గా తీసుకోవడం లేదనే భావన అభిమానుల్లో కలుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మరోసారి వంద శాతం స్ట్రైక్ రేట్ ని సాధించి చరిత్ర తిరగరాసింది. తీసుకున్న ప్రతీ స్థానం లోనూ గెలిచి, జనాల్లో పవన్ కళ్యాణ్ పై ఎంత నమ్మకం ఉందో ఈ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. కొన్ని చోట్ల ముక్కోణపు పోటీలు జరగ్గా, అందులో కూడా జనసేన పార్టీ గెలిచింది. ఇంతటి అద్భుతమైన విజయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి, వారిలో నూతనోత్సాహం తీసుకొచ్చేలా, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తాడని భావించారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. భవిష్యత్తులో ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇలాంటి కీలకమైన సమయం లో తన సతీమణి అన్నా లెజినోవా తో విడాకులు తీసుకోవడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. దీనిపైనా కూడా కార్యకర్తల సమావేశం లో పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తాడని అభిమానులు ఆశించారు.

కానీ అలాంటిదేమి జరగకపోవడం తో వారిలో తీవ్రమైన ఆవేదన చెలరేగింది. ఇదంతా పక్కన పెడితే జనసేన పార్టీ క్యాడర్ పై అనేక ప్రాంతాల్లో దారుణంగా దాడులు జరిగాయి. ఒకప్పటి పవన్ కళ్యాణ్ అయితే చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి మీడియా ముందుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నాడు. పార్టీ కి సంబంధించిన ప్రధాన నాయకత్వమే స్పందిస్తూ క్యాడర్ లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఇంత సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి?, జనసేన పార్టీ అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వినిపిస్తోంది, ఒక్కసారి లోకల్ లీడర్స్ ఎంత కష్టపడుతున్నారు, ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ఎలా పరిష్కారం తీసుకొస్తున్నారు వంటివి ఈ లోకల్ ఎన్నికల్లో పరిశీలిద్దాం అనే భావన తోనే ఆయన మౌనం గా ఉంటున్నాడా ? అనే కోణం లో కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా లోకల్ ఎన్నికలను బాగా పరిశీలిస్తే, జనాలు జనసేన వైపు చూస్తున్నారు, వాళ్ళ కోసం పార్టీ ని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసి, సోలో గా సీఎం అయ్యే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదగాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper