Bigg Boss 10 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంట్రీలు ఇచ్చి, ప్రస్తుత కంటెస్టెంట్స్ లో టాస్కులు ఆడుతున్నారు. గత సీజన్ లో కూడా ఇలాంటి ప్రక్రియ జరిగింది. కానీ ఆ సీజన్ లో అతిధులుగా వచ్చిన పాత కంటెస్టెంట్స్ ని హౌస్ మేట్స్ గౌరవించారు. కానీ ఈ సీజన్ లో అలాంటివి జరగలేదు. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్, సంజన గల్రాని , కళ్యాణ్ పడాల , దివ్య నిఖిత వచ్చారు. వీరితో ప్రస్తుత హౌస్ మేట్స్ గొడవ పడడం గమనార్హం. ఇది చూసిన తర్వాత ఇదేమి టాక్సిక్ సీజన్ రా బాబు అని అనిపించక తప్పదు. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ సీజన్ హౌస్ మేట్స్. ముందుగా త్రిగున్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను ఆడే ప్రతీ ఆట మోసమే, ఒక్క టాస్క్ కూడా నిజాయితీగా గెలిచినా దాఖలాలు లేవు. ఈయన కళ్యాణ్ పడాల పై నిన్నటి ఎపిసోడ్ లో ఆరోపణలు చేయడం చూసే ఆడియన్స్ కి చాలా కామెడీ గా అనిపించింది.
వివరాల్లోకి వెళ్తే నిన్నటి టాస్క్ లో కళ్యాణ్ పడాల తన టీం మేట్ శివ్ కుమార్ ని కంటెండర్ చేయడం కోసం ఒక స్ట్రాటజీ ని ఉపయోగించి, తన వైపుకి వస్తున్న కొన్ని బాల్స్ ని స్విమ్మింగ్ పూల్ లోకి విసురుతాడు. ఇది న్యాయం కాదంటూ త్రిగున్ గోల పెడుతాడు. ఎందుకు న్యాయం కాదు, అది నా స్ట్రాటజీ , మీరు కూడా అలాగే చేసుకోండి అని అంటాడు. వాస్తవానికి బిగ్ బాస్ బాల్స్ ని స్విమ్మింగ్ పూల్ లోకి విసరకూడదు అనే స్పష్టమైన రూల్ పెట్టలేదు, అలాంటి సమయంలో స్ట్రాటజీ ఉపయోగించడంలో తప్పు లేదు. త్రిగున్ దీన్ని కూడా పెద్ద రచ్చ చేసే ప్రయత్నం చేసాడు కానీ, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కేవలం కళ్యాణ్ పడాల తో మాత్రమే కాదు, ఇమ్మానుయేల్ తో కూడా ఆయన గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేసాడు. ప్రతీ రౌండ్ లోనూ ఎదో ఒక ఆరోపణ చేస్తూ , ఇమ్మానుయేల్ కి చిరాకు కలిగించాడు. అయినప్పటికీ కూడా ఆ టాస్క్ లో ఇమ్మానుయేల్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు.
ఇక ముకేశ్ కూడా దివ్య నిఖిత తో గొడవ పడుతాడు. సంచాలక్ గా మీరు సరైన నిర్ణయం చెప్పడం లేదని దివ్య ముఖేష్ ని నిలయదీయడంతో, ముకేశ్ కాస్త ట్రిగర్ అవుతాడు. అతిధిగా మీరు ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నన్ను మీతో ర్యూడ్ గా మాట్లాడించే ప్రయత్నం చేయకండని అంటాడు ముకేశ్. ఈ మాటకు దివ్య అమ్మోరు లాగా రెచ్చిపోయింది. ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఈ ఇల్లు నీది అనుకుంటున్నావా?, అసలు నీ గురించి నీ ఫీలింగ్ ఏంటి? అంటూ రెచ్చిపోయింది. నువ్వు గొప్ప ప్లేయర్ వి అయ్యుండొచ్చు కానీ, వ్యక్తిత్వం లో దారుణమైన మనిషివి అనే ట్యాగ్ వేసింది. అయితే ముకేశ్ మాత్రం ఎలాంటి కౌంటర్లు తిరిగి వెయ్యలేదు. సైలెంట్ గా ఆమెతో మాట్లాడడం మానేసాడు. చివరికి కళ్యాణ్ , దివ్య నిఖిత హౌస్ వదిలి వెళ్తున్నప్పుడు కూడా, వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ముకేశ్ బయటకు రాలేదు. అలా గెస్టులుగా వచ్చిన కంటెస్టెంట్స్ ని అవమానించి పంపారు ఈ సీజన్ హౌస్ మేట్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.