Homeక్రీడలుక్రికెట్‌Bangladesh vs South Africa: సెంచూరియన్ లో సఫారీల విధ్వంసం.. బంగ్లాదేశ్ కు కన్నీళ్లు ఒక్కటే...

Bangladesh vs South Africa: సెంచూరియన్ లో సఫారీల విధ్వంసం.. బంగ్లాదేశ్ కు కన్నీళ్లు ఒక్కటే తక్కువ..

Bangladesh vs South Africa: క్రికెట్లో దక్షిణాఫ్రికా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నది. సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా మార్క్ వెస్ అకెర్ మన్ (Marques Acerman) అద్భుతమైన బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 138 బంతుల్లో 150 పరుగులు చేసి.. జట్టు భారీష్ స్కోర్ చేసే విధంగా పునాది వేశాడు. మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా […]

Bangladesh vs South Africa: క్రికెట్లో దక్షిణాఫ్రికా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నది. సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా మార్క్ వెస్ అకెర్ మన్ (Marques Acerman) అద్భుతమైన బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 138 బంతుల్లో 150 పరుగులు చేసి.. జట్టు భారీష్ స్కోర్ చేసే విధంగా పునాది వేశాడు. మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 7 వికెట్లు నష్టానికి 494 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ సాధించిన 91 పరుగులపై ఏకంగా 403 పరుగుల లీడ్ సంపాదించింది.

అకెర్ మన్ విధ్వంసం

మ్యాచ్ తొలి రోజు ముగిసే సమయానికి 88/1 తో ఉన్న దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆటను దూకుడుగా కొనసాగించింది. ఓపెనర్ అకెర్ మన్ బంగ్లాదేశ్ బౌలర్ల మీద ఎదురు దాడి చేశాడు. కేవలం 111 బంతుల్లోనే అతడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత దూకుడు మరింత పెంచాడు. 138 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఇతడు ఇన్నింగ్స్ లో బౌండరీలు అధికంగా ఉన్నాయి. చివరికి ఇస్లాం బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. అకెర్ మన్ తొలి టెస్ట్ లో 157 పరుగులు చేశాడు. వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ చేసి తన సత్తాను చాటుకున్నాడు..

అకెర్మన్ తో పాటు ఇతర బ్యాటర్లు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. టోనీ డీ జోర్జి 66 పరుగులు చేశాడు. జట్టుకు కీలకమైన సహకారం అందించాడు. మరోవైపు వియాన్ ముల్డర్ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 100 పరుగులు చేసిన అతడు దక్షిణాఫ్రికా స్కోర్ ను మరింత మందులు తీసుకెళ్లాడు. మార్కో జాన్సన్ కూడా బంగ్లాదేశ్ బౌలర్ల మీద ఎదురు దాడి చేశాడు. 67 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. ఏడో వికెట్ కు ముల్డర్.. జాన్సన్ ఏకంగా 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్ దూకుడు ముందు బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బందులు పడ్డారు. రోజంతా 98 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. అకె ర్మన్, ముల్డర్, జాన్సన్ ను ఏమాత్రం కట్టడం చేయలేకపోయారు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 494/7 తో నిలిచింది. బంగ్లాదేశ్ మీద ఏకంగా 403 పరుగుల లీడ్ లో ఉంది. మూడోరోజు ఆటలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఎప్పుడు ముగుస్తుంది.. బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ లో ఎంతవరకు పోరాడుతుంది.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా .. ఈ మ్యాచ్ లో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper