Jabardasth Naresh : జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ , క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు పొట్టి నరేష్. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుండి , నేటి వరకు ఆ షోలో కమెడియన్ గా కొనసాగుతున్నది బహుశా ఈయన ఒక్కడే అనుకుంటా. తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నరేష్ పై సోషల్ మీడియా లో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టేవి. నరేష్ డబ్బుల విషయం లో చాలా కఠినంగా ఉంటాడని, ప్రతీ చిన్న పనికి ఆయన డబ్బు ని ఆశిస్తాడని, ఎంత ముఖ్యమైన పని అయినప్పటికీ , తన బైక్ లో పెట్రోల్ కొట్టిస్తే కానీ కదలడని , ఒక్కో ఈవెంట్ కి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటాడని , ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. అయితే దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు నరేష్.
ఆయన మాట్లాడుతూ ‘నేను ఒక్కో ఈవెంట్ కి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తానని కొందరు అంటుంటారు. కానీ నేను ఉచితంగా కొంతమందికి ఈవెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొంతమంది నన్ను నచ్చడం లేదంటే , కచ్చితంగా వాళ్ళ నుండి రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తా. నా విలువకు గౌరవం ఉన్న చోటనే నేను ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను నెలకు 8 నుండి 9 ఈవెంట్లు చేస్తుంటాను. కానీ సంక్త్రాంతి , దసరా వంటి ప్రత్యేక పండుగ సమయాల్లో 13 నుండి 14 ఈవెంట్లు చేస్తుంటాను. జబర్దస్త్ , శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షోస్ తో పాటు , ఎన్నో ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ప్రతీ నెల చేస్తుంటాను. ఖాళీ సమయాల్లో నా వ్యక్తిగత పనులు చేసుకుంటూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.
అయితే ఒక్కో ఈవెంట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూ లో తెలియజేయలేదు కానీ , సోషల్ మీడియా సమాచారం ప్రకారం , ఒక్కో ఈవెంట్ కి లక్ష నుండి 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటాడని అంటున్నారు. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంపాదించే దానికంటే మూడు 10 రెట్లు ఎక్కువగా నరేష్ నెల సంపాదన ఉంటుంది అన్నమాట. అయితే నరేష్ కేవలం టీవీ షోస్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. సినిమాల్లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.