Bigg Boss 10 Telugu: గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో డిమోన్ పవన్, రీతూ చౌదరి మధ్య జరిగిన లవ్ ట్రాక్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో వీళ్లిద్దరి ట్రాక్ చాలా క్రింజ్ గా ఉందంటూ ఆడియన్స్ చిరాకు పడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా, వీళ్లిద్దరి ప్రేమని జనాలు అంగీకరించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏడాది పాటు బాగానే ఉన్నారు కానీ, ఈమధ్యనే వీళ్ళ మధ్య గొడవలు ఏర్పడి విడిపోయారు. అయితే ఈరోజు ఎపిసోడ్ లో వీళ్లిద్దరు జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని మనమంతా చూడొచ్చు. దీంతో విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ కలిసిపోయారా?, లేదా బిగ్ బాస్ టీం రిక్వెస్ట్ మేరకు బలవంతంగా కలిసి హౌస్ లోకి అడుగుపెట్టారా అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో ముకేశ్ , డిమోన్ పవన్ ల మధ్య భీకర పోరు జరగ్గా, రీతూ చౌదరి, దేబ్జాని మధ్య కూడా అదే రేంజ్ పోరు జరిగింది. ఈ టాస్క్ కి సంచాలక్ గా త్రిగున్ వ్యవహరించాడు. స్విమ్మింగ్ పూల్ లోకి బాల్ ని నేరుగా విసరడంతో త్రిగున్ ఆ రౌండ్ ని క్యాన్సిల్ చేస్తానని అంటాడు. అప్పుడు రీతూ చౌదరి, త్రిగున్ మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. బిగ్ బాస్ మిమ్మల్ని సంచాలక్ గా పెట్టారు, కానీ మీరు మీ నిర్ణయం తీసుకోవడానికి హౌస్ మేట్స్ ని ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చింది. అనంతరం రీతూ చౌదరి గేమ్ పాస్ అని త్రిగున్ ని అడగ్గా, త్రిగున్ అందుకు ఒప్పుకోడు. అలా వీళ్ళ మధ్య మాటల యుద్ధం చాలా గట్టిగానే జరిగింది.