Viral Photo : విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనుష్క శర్మతో సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న విరాట్.. చివరికి మూడు ముళ్ళతో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి, అనుష్క శర్మకు ఒక పాప, ఒక బాబు సంతానం ఉన్నారు. విరాట్ కోహ్లీకి మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారీగానే ఆస్తులు ఉన్నాయి. జాతీయ మీడియాలో ఆమధ్య ప్రసారం అయిన వార్తల ప్రకారం విరాట్ కోహ్లీ లండన్లో స్థిరపడేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాడని తెలుస్తోంది.. ఇండియాలో విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు విపరీతంగా వస్తున్నారు. దానివల్ల అతడు స్వేచ్ఛగా తన కుటుంబంతో గడపలేకపోతున్నాడు. అందువల్లే అతడు లండన్ లో స్థిరపడేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లండన్ లో ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేసి.. త్వరలో అక్కడ ఉండడానికి అతడు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే పలు సందర్భాల్లో కుటుంబంతో కలిసి విరాట్ లండన్ వెళ్ళాడు. అక్కడే కొద్ది రోజుల పాటు ఉన్నాడు. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు విరాట్ కోహ్లీ లండన్ నుంచి వచ్చాడు.
చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వివాహం జరిగిన తర్వాత అనుష్క శర్మ సినిమాలకు దాదాపుగా వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. ఇద్దరు పిల్లల తల్లిగా.. ఆమె మాతృత్వ హోదాను అనుభవిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గతంలో అనేకసార్లు వాణిజ్య ప్రకటనలలో నటించారు. కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్ లు చూసేందుకు మినహా.. ఎక్కడికి పెద్దగా బయటికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆమె విరాట్ కోహ్లీతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించనుంది. శ్యామ్ స్టీల్ అనే కంపెనీకి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే శ్యామ్ స్టీల్ సంస్థ రూపొందించిన యాడ్ లో వారు కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఫోటోషూట్ కూడా పూర్తయింది. వీడియో షూటింగ్ కూడా ముగిసింది. ఈ విషయాన్ని శ్యాం స్టీల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ యాడ్లో నటించేందుకు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ భారీగానే ఫీజు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఎంత మొత్తంలో తీసుకున్నారనేది బయటికి వెల్లడి కాలేదు. వ్యాయామానికి ప్రధమ ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. 36 సంవత్సరాల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఇక అనుష్క శర్మ బాలీవుడ్లో ప్రవేశించిన తొలినాళ్లలో ఎలా అయితే ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. మొత్తంగా వీరిద్దరి జంట తమకు ప్రచారం చేయడం వల్ల.. తమ కంపెనీ లాభాల బాట పడుతుందని శ్యామ్ స్టీల్ సంస్థ యాజమాన్యం భావిస్తోంది.