Homeక్రీడలుక్రికెట్‌India vs England ODI Series: రోకోకు తోడుగా అతడు దిగుతున్నాడు.. ఇంగ్లాండ్ కు మ*రణ...

India vs England ODI Series: రోకోకు తోడుగా అతడు దిగుతున్నాడు.. ఇంగ్లాండ్ కు మ*రణ శాసనమే..

India vs England ODI Series: టి20 సిరీస్ వైట్ వాష్ అయింది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ టీమిండియా విజయం అందుకోలేకపోయింది. ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడం.. ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోవడంతో టీమ్ ఇండియా మీద తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి తోడు టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా స్థానం పడిపోయింది. చాలా సంవత్సరాలుగా నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా.. వరుసగా రెండు సిరీస్ లు కోల్పోవడంతో తన స్థానాన్ని దిగజార్చుకుంది.

ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. వన్డే సిరీస్ లో టీమిండియాలోకి రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ వచ్చేసారు. వీరిద్దరు రావడంతో టీమిండియా బలం పెరిగింది. వీరిద్దరు కూడా మైదానంలో స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నారు. అంతేకాదు అత్యంత కఠినమైన బంతులను పదేపదే ఆడుతున్నారు. తద్వారా ఇంగ్లాండ్ మైదానాలకు అలవాటు పడుతున్నారు. విరాట్ కోహ్లీ ఎప్పటి మాదిరిగానే ఉత్సాహంగా కనిపిస్తుండగా.. రోహిత్ శర్మ బరువు మొత్తం తగ్గిపోయి కుర్రాడి మాదిరిగా ఆడుతున్నాడు.

వీరిద్దరికీ తోడుగా బుమ్రా జట్టులోకి వచ్చేసాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ టీమిండియా కు అత్యంత ముఖ్యమైనది. అందువల్లే మేనేజ్మెంట్ బుమ్రా ను రంగంలోకి దింపింది. విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ.. బుమ్రా కలిసి వన్డే మ్యాచ్ లు ఆడక దాదాపు 967 రోజులు పూర్తయ్యాయి. ఈ త్రయం 2023 నవంబర్ 19న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి వీరు ముగ్గురు కలిసి ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. పైగా వీరు ముగ్గురు మీద మేనేజ్మెంట్ భారీగా అంచనాలు పెట్టుకుంది. ఇంగ్లాండ్ గడ్డమీద వీరి ముగ్గురికి ఆడిన అనుభవం ఉంది. గొప్ప రికార్డులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్లో వీరు ముగ్గురు సత్తా చూపుతారని.. టీమిండియా పరువు కాపాడతారని అభిమానులు భావిస్తున్నారు.

బుమ్రా ఐపీఎల్ లో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. అతనికి ఇంగ్లాండు మైదానాల మీద మెరుగైన రికార్డు ఉంది. పైగా బౌన్సీ మైదానాల మీద ఇతడు అద్భుతంగా బంతులు వేస్తాడు. లెంత్ రాబడతాడు. తనదైన రోజున వికెట్ల పండుగ చేస్తాడు. ఇతడి బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎడ్జ్ బాస్టన్ మైదానం మీద ఇతడికి మెరుగైన రికార్డు ఉంది. తొలి వన్డే మంగళవారం జరుగుతుంది. ఇప్పటికే అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించాడు. బంతులు కూడా వేగంగా వేస్తున్నాడు. ఇతడిని ఎదుర్కోవడం ఇంగ్లాండ్ జట్టుకు ఒక రకంగా ఇబ్బంది అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవలి వన్డే సిరీస్లలో వీరిద్దరూ అదరగొట్టారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular