Lucky Bhaskar 2: ఫ్యామిలీ ఆడియన్స్ అంత తేలికగా ఒక చిత్రానికి కనెక్ట్ అవ్వరు. ఒకవేళ వాళ్ళు కనెక్ట్ ఆ సినిమాల రేంజ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఉదాహరణల్లో ఒకటి ‘లక్కీ భాస్కర్’ చిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై , వెంకీ అట్లూరి దర్శకత్వం లో , దుల్కర్ సల్మాన్ , మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. థియేటర్స్ లో కంటే , ఓటీటీ లో ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం #RRR తర్వాత అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న తెలుగు చిత్రం గా రికార్డ్స్ కి ఎక్కింది. #RRR కి 42 మిలియన్ వ్యూస్ రాగా, ‘లక్కీ భాస్కర్’ కి 31 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఈ రెండు చిత్రాలకు ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన చిత్రాలకు దారిద్రపుల్లోకి కూడా రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది. అలాంటి చిత్రానికి సీక్వెల్ ని అభిమానులు కోరడం లో తప్పు లేదు. ఎందుకంటే భాస్కర్ అనే క్యారెక్టర్ విదేశాల్లోకి వెళ్లి స్థిరపడిన తర్వాత , తన జీవితం లో ఎదురైన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక సినిమాని తీయొచ్చు. డైరెక్టర్ వెంకీ అట్లూరి కి ఆ ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘లక్కీ భాస్కర్’ కి సీక్వెల్ ఉంటుంది అనే విషయాన్ని ఖరారు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే వెంకీ అట్లూరి రీసెంట్ గానే సూర్య తో ‘విశ్వనాధ్ & సన్స్ ‘ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని రీసెంట్ గానే మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ ‘లక్కీ భాస్కర్’ ప్రస్తావన తీసుకొని రాగా, వెంకీ స్పందిస్తూ ‘లక్కీ భాస్కర్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి. నాకు కూడా ఆ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని చాలా కోరిక గా ఉంది. కానీ మంచి కథ కుదిరినప్పుడే నేను దాని గురించి ఆలోచిస్తాను. ‘విశ్వనాధ్ & సన్స్ ‘ తర్వాత నేను రెండు ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యి ఉన్నాను , అందులో ఒకటి ధనుష్ గారితో ఉంటుంది , మరొకటి ‘హోమ్ ఎలోన్ ‘ స్టైల్ లో ఒక సినిమా చెయ్యాలని ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యాకనే ‘లక్కీ భాస్కర్ 2′ గురించి ఆలోచిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు వెంకీ అట్లూరి.