Jantar Mantar Protest: ఇటీవల ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) చేపట్టిన ఉద్యమంలో సామాజిక మాధ్యమాల పాత్ర ఎంతగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. సీజేపీ ఏర్పడిందే సోషల మీడియా పిలుపుతో. తాజాగా జంతర్ మంతర్ ఉద్యమాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా విస్తృత ప్రచారం పొందింది. మీడియా కూడా ఎక్కువగా కవరేజ్ ఇచ్చింది. అయితే కొందరు యువత, మైనర్లు కూడా అక్కడికి వచ్చి రీల్స్ తీస్తూ ఫాలోవర్లు పెంచుకున్నారు. ఇది ఆధునిక ఉద్యమాల స్వరూపం ఎలా మారుతోందో చూపే ఉదాహరణ.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం..
కొంతమంది జంతర్‌మందతర్ ఉద్యమం వద్ద రీల్స్ చేయడం ద్వారా ఫాలోవర్ల సంఖ్య పెంచుకున్నారు. ఓ మైనర్‌కు ఇన్‌స్టాలో మొదట 5 వేల మంది ఫాలోవర్లు ఉండేవారట. జంతర్‌మంతర్ వద్ద రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అతని ఫాలోవర్లు 7.5 లక్షలకు పెరిగారట. ఫాలోవర్ల పెరుగుదలతో కొందరు కొత్త ఫోన్ కొనుక్కుని అక్కడే విజయం సాధించానని చెప్పుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఉద్యమం కంటే వ్యక్తిగత ప్రచారం, కంటెంట్ సృష్టి మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు యువతను ఆకర్షించి, వారిని వేదిక వద్దకు తీసుకువచ్చే శక్తిగా మారాయి.
దూషణ, ద్వేషంతో ఆకర్షించే ప్రయత్నాలు..
కొంతమంది దూషించి, ద్వేషపూరిత వ్యాఖ్యలతో రీల్స్ చేసి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా కొందరు లబ్ధి పొందినట్లు కనిపిస్తోంది. ఇలాంటి విధానం ఉద్యమం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. సానుకూలంగా, నిజమైన సమస్యలపై అవగాహన కల్పించే రీల్స్ చేస్తే మంచిది కానీ, ద్వేషం, తిట్లు ద్వారా దష్టి సాధించే ప్రయత్నాలు ప్రజా మద్దతును బలహీనపరుస్తాయి.
ఉద్యమాలపై ఇన్‌స్టా ప్రభావం..
తాజా జంతర్‌మంతర్ రీల్స్ ఇన్‌స్టా బేస్డ్ హెజిటేషన్ అనే ధోరణిని సూచిస్తున్నాయి. అంటే సామాజిక మాధ్యమాల్లో కనిపించే విధంగా, లైక్‌లు, ఫాలోవర్లు పెరగాలనే ఆలోచనతోనే చాలామంది పాల్గొంటున్నారు. నిజమైన సమస్యలపై పోరాటం కంటే వైరల్ కంటెంట్ సృష్టి ప్రధానమైపోతే ఉద్యమం బలహీనపడుతుంది. అదే సమయంలో సామాజిక మాధ్యమాలు సమాచారం వ్యాప్తి చేయడంలో, యువతను సమీకరించడంలో సహాయపడతాయి.
జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ ఉద్యమంలో రీల్స్ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాలు ఆధునిక ప్రజా ఉద్యమాల ఆకారం మార్చేస్తున్నాయి. అయితే వాటిని సానుకూలంగా, నిజాయితీగా ఉపయోగిస్తేనే అసలు లక్ష్యాలు నెరవేరుతాయి.
View this post on Instagram