Vishnu Priya: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మనకి బాగా వినిపిస్తున్న పేరు విష్ణు ప్రియ . ఈమె సినిమాలు , టీవీ షోస్ ద్వారా ఎంత డబ్బులు సంపాదించిందో తెలియదు కానీ , సోషల్ మీడియా ద్వారా మాత్రం నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ‘సబ్ స్కిప్షన్’ అనే ఆప్షన్ ద్వారా ఈమె 5070 మంది ఫాలోవర్స్ ని సంపాదించింది. ఒక్కొక్కరి దగ్గర నుండి నెలకు ఈమె 390 రూపాయిలు తీసుకుంటుంది. అంటే నెలకు దాదాపుగా 20 లక్షల రూపాయిలను ఆమె సంపాదిస్తోంది అన్నమాట. ‘సబ్ స్క్రిప్షన్’ తీసుకున్న యూజర్స్ కోసం ఈమె కొన్ని ఎక్సక్లూసివ్ కంటెంట్ ని అందిస్తూ ఉంటుంది. ఈ కంటెంట్ లో ఈమె అందాల ఆరబోత హద్దులు దాటి ఉంటుంది. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
కొంతమంది అయితే విష్ణు ప్రియ పై పోలీస్ కేసులు కూడా వేశారు. ఒకసారి తన అభిమానులతో ఏర్పాటు చేసిన లైవ్ చాట్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బోల్డ్ గా సమాధానం చెప్తూ ‘నా బాడీ కౌంట్ 5’ అంటూ మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. దీనిపై మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో డిబేట్స్ కూడా నడిచాయి. అయితే బయట తన గురించి ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు , తనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే అనే వైఖరి తో విష్ణు ప్రియ ముందుకు వెళ్తోంది. లేటెస్ట్ గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను అప్లోడ్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వాటిని ఈ ఆర్టికల్ చివర్లో అందిస్తున్నాము చూడండి. లేటెస్ట్ యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా విష్ణు ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.
ఇక విష్ణు ప్రియ కెరీర్ విషయానికి వస్తే ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే ‘పోవే పోరా’ అనే షో తో బాగా పాపులర్ అయ్యింది. ఆ షో పెద్ద హిట్ అవ్వడం తో ఈమెకు మరికొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అనేక టీవీ షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ వచ్చింది. తద్వారా వచ్చిన ఫేమ్ తో పలు సినిమాల్లో , వెబ్ సిరీస్ లో నటించి ఆడియన్స్ కి ఇంకా బాగా దగ్గరైంది. ఇక ఆ తర్వాత ‘బిగ్ బాస్ 8’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఒక ఇంట్లో అమ్మాయి లాగా మారిపోయింది. ముఖ్యంగా ఆమె నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు. అలాంటి ఆమె , అకస్మాత్తుగా ఇలా బోల్డ్ అవతారం ఎత్తడంతో కాస్త విమర్శలు ఎదురు అవుతున్నాయి.