Vaibhav Suryavanshi : సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. ప్రధాన మీడియాలోనూ అదే తీరు. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. చేసింది 34 పరుగులే అయినప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ సూపర్బ్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడు వీరోచితంగా బ్యాటింగ్ చేస్తుంటే మైదానంలో మ్యాచ్ చూస్తున్న లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయంక ఆశ్చర్యపోయాడు.. అతడిని అదే పనిగా చూసి.. వారెవ్వా ఏం ఆటగాడు అంటూ తన ముఖంలో హావభావాలు ప్రదర్శించాడు. ముఖ్యంగా తొలి బంతికి వైభవ్ సూర్యవంశీ సిక్సర్ కొట్టడంతో.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. సూర్య వంశీ, యశస్వి జైస్వాల్ వంటి వారు దూకుడుగా ఆడినప్పటికీ.. రాజస్థాన్ జట్టులో మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అందువల్లే ఆ జట్టు రెండు పరుగుల తేడాతో లక్నో ఎదుట తలవంచాల్సి వచ్చింది.. మొత్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో లక్నో విజయం సాధించింది.
Also Read : 14ఏళ్ల పిల్లాడు కదా.. ఔట్ కాగానే ఏడ్చుకుంటూ వెళ్లాడు.. వైరల్ ఫోటో
మ్యాచ్ ముగిసిన తర్వాత..
లక్నో – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత.. మైదానం మొత్తం సూర్యవంశీ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ క్రమంలో లక్నో జుట్టు ఓనర్ సంజీవ్ గోయంక మైదానంలోకి వచ్చాడు. వైభవ్ సూర్య వంశీతో మాట్లాడాడు.. ఈ క్రమంలో వారిద్దరి మధ్య అనేక చర్చలు జరిగాయి. ఇక ఈ ఫోటో సోషల్ మీడియా పడటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ సూర్య వంశీ తన బేస్ ప్రైస్ 30 లక్షలు గా ఎంటర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడు 1.1 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేస్తే.. ఆ జట్టులోకి వెళ్లిపోయాడు. ఒకానొక దశలో వైభవ్ సూర్యవంశీ కోసం ఢిల్లీ జట్టు యాజమాన్యం కూడా తీవ్రంగా పోటీ పడింది. చివరికి రాజస్థాన్ జట్టు యాజమాన్యం వైభవ్ సూర్య వంశీని సొంతం చేసుకుంది.. ప్రతి ఏడాదికి ఒకసారి మినీ వేలం జరుగుతుంది. మెగా వేలం ప్రతి 24 నెలలకు ఒకసారి జరుగుతుంది. ” వైభవ్ సూర్య వంశీ ఆట తీరు చూసి సంజీవ్ గోయంక ముచ్చట పడ్డాడు. అతడితో మాట్లాడాడు. బహుశా అతడిని లక్నో జట్టులోకి తీసుకుంటాడేమో.. దీనికి నిబంధనలు సహకరిస్తాయా.. అది సాధ్యమవుతుందా అనే విషయాలను పక్కన పెడితే.. సంజీవ్ గోయంక కచ్చితంగా వైభవ్ సూర్య వంశీని సొంతం చేసుకునే విధంగా ఉన్నాడని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ నిన్న అవుట్ అయిన తర్వాత ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాడు. దీంతో అతనిని అలా చూసిన చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.. అయ్యో బుడ్డోడా నువ్వు ఏడవకురా అంటూ ఊరడించే ప్రయత్నం చేశారు. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది.. భవిష్యత్తు కాలంలో విరాట్ కోహ్లీ, సచిన్ స్థాయికి చేరుకుంటావని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read : విరాట్ , అనుష్క.. చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవు: వైరల్ ఫోటో