Silk Smitha: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. వెండితెర పై బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ , వాళ్ళు అందుకుంటున్న క్రేజ్ ని చూసిన తర్వాత , కొంతమందికి మేము కూడా అలా సినీ రంగం లోకి వెళ్లి పెద్ద స్థాయికి చేరుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలా ఎన్నో ఆశల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు కొంతమంది గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కొంతమంది ప్రయత్నం చేసి ఓపిక లేక తిరిగి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలవడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి అసాధారణమైన హీరోయిన్ గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆమె మరెవరో కాదు , సిల్క్ స్మిత. నేటి తరం ప్రేక్షకులు పుట్టకముందే ఒక సంచలనం.
అయితే సినీ రంగం ఒక రంగుల ప్రపంచం , పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని చెప్పడానికి ఈమె జీవిత చరిత్ర ఒక ఉదాహరణ. ఈమె ఆరోజుల్లోనే కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకునేది. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఈమె సొంతం. ఆరోజుల్లో సినిమా హిట్ అయినా , ఫ్లాప్ అయినా , సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉందా లేదా? అనేది చూసి థియేటర్స్ కి వెళ్లేవారు జనాలు. అలాంటి రేంజ్ ఉండేది. అందుకే ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు , దర్శక నిర్మాతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. ఈమె గురించి హిందీ లో ‘డర్టీ పిక్చర్’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అయితే సిల్క్ స్మిత గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ప్రముఖ హీరో శ్రీహరి సతీమణి శాంతి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘సిల్క్ స్మిత ని నేను ప్రేమగా అక్కా అని పీల్చేదాన్ని. ఆమె నాతో చాలా క్లోజ్ గా ఉండేది. తన జీవితం లోని వ్యక్తిగత విషయాలను కూడా నా దగ్గర దాచిపెట్టేది కాదు. నాతోనే కాదు , అందరితోనూ ఆమె చాలా కలుపుగోలు తనంతో ఉండేది. ఆరోజుల్లో ఆమె ఒక్కో సినిమాకు లక్ష నుండి 3 లక్షల రెమ్యూనరేషన్ ని అందుకునేది. తాను పడుకునే బెడ్ పై నోట్ల కట్టలు పరుచుకొని పడుకునేది. దీని గురించి ఒకసారి ఆమెని నేను అడిగినప్పుడు, అవకాశాల కోసం నేను తిరిగినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు, ఇప్పుడు నేనే ఆ డబ్బులపై పడుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతటి సంపద సంపాదించిన సిల్క్ స్మిత , చివరికి సినిమాలను నిర్మించి , భారీ గా నష్టపోయి, చివరికి ఎవ్వరూ లేకుండా అనాధలాగా చనిపోయింది.