Tejaswini Nandamuri: ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ గోల్డెన్ యుగం లో ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , సూపర్ స్టార్ గా , నెంబర్ 1 హీరోగా దశాబ్దాలు తెలుగు సినిమా పరిశ్రమని ఏలడమే కాకుండా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి , తెలుగు దేశం పార్టీ ని స్థాపించి , మొదటి పోటీలోనే సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ కూడా అద్భుతంగా రాణించి నిన్నటి తరం ప్రేక్షకులకు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా నిలిచారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో సంచలన రికార్డ్స్ నెలకొల్పుతూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేటి తరం సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతూ , నందమూరి ఖ్యాతి ని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లారు.
అయితే నందమూరి ఫ్యామిలీ నుండి ఎంతో మంది వచ్చారు కానీ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యారు. తారకరత్న, కళ్యాణ్ రామ్ వంటి వారు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అందరూ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొదలైనట్టే అయ్యి , ఆగిపోయింది ఈ చిత్రం. ఇప్పుడు మోక్షజ్ఞ మొదటి చిత్రం ఎవరితో ఉండబోతుంది అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడో తెలియదు , బాలయ్య రెండవ కూతురు తేజస్విని మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. రీసెంట్ గానే ఈమె ‘లవ్ స్టోరీ’ చిత్రం లోని ‘సారంగ ధనియా’ పాటకు చిందులు వేస్తూ , ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆమె డ్యాన్స్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా ఈ వీడియో ని విడుదల చేయడానికి కారణం ఏమైనా ఉందా అని అభిమానులు చర్చించుకోవడం కూడా మొదలు పెట్టారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు ఫ్యాన్స్. చివరికి వాళ్ళ అనుమానాలే నిజం కానున్నాయి. త్వరలోనే తేజస్విని ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. వైజాగ్ ప్రస్తుత ఎంపీ భరత్ ని పెళ్లి చేసుకున్న తర్వాత , ఒక సాధారణ గృహిణి గా బాధ్యతలు నిర్వహిస్తూనే , మరో పక్క వ్యాపారాలను చూసుకుంటూ వస్తోంది తేజస్విని. అంతే కాదు బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ని సూపర్ హిట్స్ ని అందుకోవడానికి గల కారణం కూడా తేజస్విని ప్లానింగ్ వల్లే. అలాంటి ఆమె ఇప్పుడు సినీ రంగం లోకి రాబోతుంది. ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.