Homeజాతీయ వార్తలుOmar Abdullah Divorce: బిగ్ బ్రేకింగ్.. భార్య నుంచి విడాకులు తీసుకున్న ముఖ్యమంత్రి..

Omar Abdullah Divorce: బిగ్ బ్రేకింగ్.. భార్య నుంచి విడాకులు తీసుకున్న ముఖ్యమంత్రి..

Omar Abdullah Divorce: కలిసి ఉన్నంతవరకు అంతా బాగానే ఉంటుంది. అప్పుడు ఎటువంటి అపరాధ భావాలు కనిపించవు. ఎదుటి మనిషిలో ఉన్న లోపాలు సాక్షాత్కారం కావు. అప్పుడు మనసు నిండా ప్రేమే ఉంటుంది కాబట్టి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ ఉంటారు. శతకారుడు చెప్పినట్టు.. ప్రేమ తగ్గిపోయి.. మనిషి మీద నమ్మకం తగ్గిపోయి.. మనసులో ఒక రకమైన నిర్లక్ష్య భావం పెరిగిపోతే ఆ తర్వాత చెప్పాల్సిన పని ఉండదు. ప్రేమ అనేది కనిపించదు. కేవలం ఎదుటి మనిషిలో […]

Omar Abdullah Divorce: కలిసి ఉన్నంతవరకు అంతా బాగానే ఉంటుంది. అప్పుడు ఎటువంటి అపరాధ భావాలు కనిపించవు. ఎదుటి మనిషిలో ఉన్న లోపాలు సాక్షాత్కారం కావు. అప్పుడు మనసు నిండా ప్రేమే ఉంటుంది కాబట్టి.. ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ ఉంటారు.

శతకారుడు చెప్పినట్టు.. ప్రేమ తగ్గిపోయి.. మనిషి మీద నమ్మకం తగ్గిపోయి.. మనసులో ఒక రకమైన నిర్లక్ష్య భావం పెరిగిపోతే ఆ తర్వాత చెప్పాల్సిన పని ఉండదు. ప్రేమ అనేది కనిపించదు. కేవలం ఎదుటి మనిషిలో ఉన్న లోపాలు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు వేసే అడుగు.. మాట్లాడే మాట.. చూసే చూపు.. ఇవేవీ కూడా కంటికి కనిపించవు. పైగా ఆ మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే భావం లోపల ఉంటుంది.

పై ఉపోద్ఘాతం మొత్తం ఓ ముఖ్యమంత్రి జీవితంలో చోటుచేసుకుంది. పైగా ఆయన దాదాపు 15 సంవత్సరాలుగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. 1994లో పెళ్లి చేసుకున్న ఆయన.. కొంతకాలం పాటు తన భార్యతో సంసారం సాగించాడు. పిల్లలు కూడా ఉన్నారు. సరిగా 2011లో ఆమెతో దూరంగా జరిగిపోయాడు. అప్పటినుంచి ఎవరిదారులు వారివి అన్నట్టుగా ఉన్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అనేక రకాల న్యాయ ప్రక్రియలు పూర్తయిన తర్వాత చివరికి విడిపోయారు. శుక్రవారం వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

తన భార్య నుంచి విడాకులు తీసుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా. ఈయనకు 1994లో పాయల్ అనే యువతితో పెళ్లి జరిగింది. 2011 వరకు వీరిద్దరూ బాగానే ఉన్నారు. అయితే 2011 నుంచి వేరుగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టులో 2024లో వారిద్దరు విడాకుల పిటిషన్ వేశారు. పరస్పర అంగీకారంతోనే తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటున్నామని.. పెండింగ్లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకుంటామని వారిద్దరు సుప్రీంకోర్టుకు చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు డివోర్స్ మంజూరు చేసింది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి విడాకులు తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సౌమ్యుడిగా పేరుపొందిన అబ్దుల్లా వైవాహిక జీవితంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. విడాకుల తర్వాత ఓమర్ మరో పెళ్లి చేసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper