Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli: పాపం విరాట్ కోహ్లీకి ప్రశాంతత లేకుండా పోయింది

Virat Kohli: పాపం విరాట్ కోహ్లీకి ప్రశాంతత లేకుండా పోయింది

Virat Kohli: టీం ఇండియా స్టార్ ఆటగాడిగా.. పరుగుల యంత్రంగా విరాట్ కోహ్లీకి పేరు ఉంది. టీమ్ ఇండియా సాధించిన ఎన్నో విజయాలలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. అతడి నాయకత్వంలో టీమిండియా అగ్రిసివ్ ఆటతీరు మొదలుపెట్టింది. ఎన్నో దేశాల మీద అద్భుతమైన క్రికెట్ ఆడింది. నాయకుడిగా.. ఆటగాడిగా విరాట్ కోహ్లీ.. అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియా 2024లో పొట్టి ప్రపంచ కప్ అందుకున్న తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. టీమిండియా కు 2027లో వన్డే వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా అతడు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తన మకాం మొత్తాన్ని లండన్ నగరానికి షిఫ్ట్ చేశాడు.

భార్య.. పిల్లలతో కొంతకాలంగా విరాట్ కోహ్లీ లండన్ నగరంలోనే ఉంటున్నాడు. ఐపీఎల్ ఆడినప్పుడు.. టీమిండియా స్వదేశంలో మ్యాచులు ఆడినప్పుడు.. ఇంకా ఏమైనా వ్యవహారాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు ఇండియాకు వస్తున్నాడు. ఇక్కడ పనులు చక్కపెట్టుకొని లండన్ వెళ్లిపోతున్నాడు. లండన్ లోనే విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇండియాలో అతడికి ప్రైవసీ లేకపోవడంతో లండన్ వచ్చాడు. ఇక్కడ కూడా అతడికి ప్రైవసీ లేకుండా పోతుంది.

గాయం నుంచి సాంత్వన పొందిన తర్వాత విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కాక్స్ అనే ఆటగాడు విరాట్ కోహ్లీతో సంభాషణ జరిపాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది..”విరాట్ కోహ్లీ నాతో మాట్లాడాడు. అనేక విషయాలు చెప్పుకున్నాడు. ఇటీవల ఆతులు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు మీడియాలోకి వచ్చాయి. దీంతో విరాట్ కోహ్లీ ఒక రకమైన అసహనం వ్యక్తం చేశాడు. ఇండియాలోనే కాదు తనకు ఇక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పాడు. హాయిగా తిరిగే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడని” కాక్స్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు అద్బుతంగా ఉంటాయని కాక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular