Raka Non Theatrical Business: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ పెద్దగా జరగడం లేదు. దీంతో భారీ బడ్జెట్ చిత్రాలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ‘వారణాసి’ చిత్రానికి కూడా రీసెంట్ గానే ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయం లో ఇబ్బందులు ఎదురైనట్టు మనమంతా విన్నాము. రాజమౌళి కోరినంత ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపించడం లేదు. బడ్జెట్ ఏమో 1400 కోట్ల రూపాయలకు చేరింది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రానికి కూడా ఎదురైంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల గ్రాస్ సినిమా అంటూ అభిమానులు ఈ పోస్టర్ ని చూసి తెగ మురిసిపోయారు.
అయితే ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదట. సన్ పిక్చర్స్ సంస్థ ఈ విషయం లో తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటోంది. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ ఆశించిన స్థాయికి రేట్లకు అమ్ముడుపోవడం లేదు కాబట్టి , ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశం పై చాలా గట్టి చర్చనే నడుస్తోంది. ఈమధ్య కాలం లో పాన్ ఇండియా లెవెల్ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకవేళ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే సీక్వెల్ ద్వారా భారీ గా డబ్బులు సంపాదించొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి కూడా బడ్జెట్ చాలా గట్టిగానే ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చు తగ్గ రాబడి రెండు భాగాలుగా తీస్తే వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారా నిర్మాతలు.
సోషల్ మీడియా లో ఏ చిన్న రూమర్ వచ్చినా వెంటనే స్పందించే తత్త్వం ఉన్నటువంటి అల్లు అర్జున్ టీం , ఈ రూమర్స్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియా లో ప్రచారం అయ్యేది నిజమేనేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా , రష్మిక మందాన విలన్ గా నటిస్తోంది. అదే విధంగా మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ వంటి వారు కూడా ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాయి అభయంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.